“ధోని”…ఈ పేరుకి కొత్త పరిచయం అవసరంలేదు.వికెట్ల మధ్య చిరుత వేగంతో పరిగెత్తగలడని, వికెట్ వెనకాల ఉంది ప్రత్యర్థులను అవుట్ చేయడానికి వ్యూహాలు వేయగలడని, స్టంప్ అవుట్ చేయడంలో తన తరవాతే ఎవరైనా అని, మ్యాచ్ ని ఫినిష్ చేయడం అతని స్టైల్.
చివరి ఓవర్ లో 15 పరుగులు కొట్టాలి, బాటింగ్ చేస్తున్నది ధోని అయితే.ఒత్తిడి ధోనిపై ఉండదు, బౌలర్ పై ఉంటదని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట.! జులై 7 న ధోని పుట్టిన రోజు.ఎంతో మంది ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.కానీ సెహ్వాగ్ ట్వీట్ మాత్రం చాలా స్పెషల్.

మామూలుగానే సెహ్వాగ్ ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు.పంచ్ లు, సెటైర్ లతో ఫాన్స్ ని నవ్విస్తూ ఉంటారు.ధోని బర్త్డే పై సెహ్వాగ్ ఏమని పోస్ట్ చేసారంటే.“ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి.
నీ స్టంపింగ్ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి.‘ఓం ఫినిషాయ నమః!”- వీరేంద్ర సెహ్వాగ్
.May your life be longer than this stretch and may you find happiness in everything, faster than your stumpings.Om Finishaya Namaha !
— Virender Sehwag (@virendersehwag)
ఈ పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో ఓ సెహ్వాగ్ అభిమాని ‘సెహ్వాగ్ సర్ కెరీర్‌ను నాశనం చేసిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని తెలిపాడు.దీనికి సెహ్వాగ్ వెంటనే స్పందించాడు.అది చాలా తప్పు కామెంట్ అని బదులిచ్చాడు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.2007 టీ20 ప్రపంచకప్ పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో సెహ్వాగ్‌ను పక్కనబెట్టి, యూసఫ్ పఠాన్ తీసుకోవడంతో మొదలైన ఈ ప్రచారం అతను జట్టులో చోటు కోల్పోయి.రిటైర్మెంట్ ప్రకటించినా కూడా జరుగుతూనే ఉంది.ధోని నిర్ణయాల కారణంగానే సెహ్వాగ్ జట్టులో చోటు కోల్పోయాడని అతని అభిమానులు ఇప్పటికి బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు.







