హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో గోవా ముద్దుగుమ్మ ఇలియానా ( Ileana ) ఒకరు.ఇలియానా దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు.
ఈ సినిమా అనంతరం ఈమె పోకిరి ( Pokiri ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఇక ఈ సినిమా తరువాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయింది.
వరుసగా తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమెకు అనంతరం క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా రహస్యంగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని బిడ్డకు కూడా జన్మనిచ్చారు.అయితే పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మాత్రం వెల్లడించడంతో ఒక్కసారిగా ఈమె పట్ల విమర్శలు వచ్చాయి.
ఇక చివరికి తన భర్తను ఈమె అందరికీ పరిచయం చేసే షాక్ ఇచ్చారు.

ఇక బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ తల్లిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నటువంటి ఇలియానా మొదటిసారి తన భర్త గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.నేను గర్భవతి అయినప్పటికీ పనిచేయాలనుకున్నాను కానీ పరిస్థితిలో అనుకూలంగా లేవు.ఇక నేను ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మతోపాటు తన భర్త మైకేల్ ( Micheal ) సపోర్ట్ చాలా ఉందని ఈమె తెలిపారు.
ఇక నేను నా భర్త గురించి మా బంధం గురించి బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదని తెలిపారు.గతంలో నా పట్ల విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నాను.నన్ను ఏమన్నా తీసుకోగలను.కానీ నా కుటుంబం, భర్తను విమర్శించిన, తిట్టినా తట్టుకోలేను అందుకే మా బంధం గురించి బయటకు చెప్పలేదు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.