అందరి చూపు ఈ క్రేజీ కాంబినేషన్స్ పైనే.. అంచనాలు పెరిగిపోతున్నాయిగా?

సాదారణంగా చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్ల కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.కానీ ప్రేక్షకులకు మాత్రం కొన్ని కాంబినేషన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతాయి.

 Tollywood Crazy Combinations Vijay Devarakonda Samantha Pooja Hegde Pawan Kalyan Details, Vijay Devarakonda, Samantha, Pooja Hegde, Pawan Kalyan, Hero Heroines Combinations, Nidhi Aggarwal, Prabhas, Kriti Sanon, Balakrishna Shruti Hasan,-TeluguStop.com

ఆ కాంబినేషన్ లూ ఎన్ని సార్లు రిపీట్ అయినా అదే రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో నటిస్తున్న కొత్త హీరోలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు.

ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 Tollywood Crazy Combinations Vijay Devarakonda Samantha Pooja Hegde Pawan Kalyan Details, Vijay Devarakonda, Samantha, Pooja Hegde, Pawan Kalyan, Hero Heroines Combinations, Nidhi Aggarwal, Prabhas, Kriti Sanon, Balakrishna Shruti Hasan, -అందరి చూపు ఈ క్రేజీ కాంబినేషన్స్ పైనే.. అంచనాలు పెరిగిపోతున్నాయిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

మహానటి సినిమా నాటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ అంటే ఏదో తెలియని ఆసక్తి.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ ఎలా వర్కౌట్ కాబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కాబోతుంది.ఇక విజయ్ దేవరకొండ పూజా హెగ్డే కాంబినేషన్ కూడా ఇలాంటిదే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫాన్ ఇండియా హీరో హీరోయిన్ కాంబినేషన్ అని చెప్పాలి.

ఇక మొదటి సారి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమైన పూజా హెగ్డే.ఈ జోడీ కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ కలిసి నటిస్తుండడంతో వీరిద్దరి జోడి ఎలా వర్కవుట్ అవుతుంది అన్నదానిపై కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.మరోవైపు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా పవన్ సరసన నటించబోతుంది.ఇక ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుండగా ఈ సీతారాముల కాంబినేషన్ ఎలా ఉంటుందా అని చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.ప్రభాస్ -శృతిహాసన్, ప్రభాస్- దీపికా పదుకొనే జోడి లపై కూడా ఎంతగానో ఆసక్తి పెరిగిపోయింది.

ఇంకోవైపు బాలకృష్ణ సరసన మొదటిసారి శృతిహాసన్ నటిస్తోంది.ఇక నరసింహ సినిమాలో రమ్యకృష్ణ రజనీకాంత్ జోడి కూడా అందరికీ ఫేవరెట్గా మారిపోయింది.వీరిద్దరూ ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube