అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రంతో వచ్చి నెలలు గడుస్తుంది.కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా బన్నీ ఒక చిత్రం తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు.
కాని ‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో బన్నీ తన తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.‘నా పేరు సూర్య’ సక్సెస్ అయితే వెంటనే తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈయన ఒక చిత్రాన్ని చేసేవాడు.
కాని ప్రయోగం చేసేందుకు బన్నీ భయపడుతున్నాడు.ఇప్పటికే నా పేరు సూర్య చిత్రంతో ఫ్లాప్ అయిన తాను ఈ చిత్రంతో మళ్లీ ఫ్లాప్ అవుతానేమో అనే ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తూ వచ్చాడు.
విక్రమ్ కుమార్ తీసుకు వచ్చిన స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పు చేయించాడు.అయినా కూడా నమ్మకం కలగడం లేదు.దాంతో విక్రమ్ కుమార్ మూవీని పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఒక తమిళ హీరోతో విక్రమ్ మూవీని పట్టాలెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ సమయంలోనే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కొత్త సినిమాకు ఆలస్యం చేస్తున్నందుకు ఫ్యాన్స్‌కు సారీ, అయితే ఆలస్యం అయినా కూడా మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాను అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
వరుసగా పలు సూపర్ హిట్స్‌ను అందుకున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని నటించాడు.ఆ చిత్రం కోసం కొత్త లుక్ మరియు కొత్త స్టైల్‌తో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాడు.కాని ఆ చిత్రం కాస్త ఢమాల్ అయ్యింది.
ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు బన్నీ కష్టంకు ఫలితం దక్కలేదు.దాంతో బన్నీ తీవ్రంగా నిరాశ వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో దర్శకుడు వంశీ వక్కంతం కూడా తీవ్రంగా నిరాశ పడ్డాడు.బన్నీతో సినిమా చేయాలని గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న విక్రమ్ కుమార్ తాజాగా ఇక వెయిటింగ్ తన వల్ల కాదు అనేసి పక్కకు తప్పుకున్నాడు.
బన్నీ మళ్లీ ఇప్పుడు పక్కా కమర్షియల్ కథల ఎంపికకు జాగ్రత్త పడుతున్నాడు.
భారీ ఎత్తున తాను చేయబోతున్న సినిమా సక్సెస్ అవ్వాలనే కోరికతో బన్నీ ఉన్నాడు.
అందుకే ఆలస్యం అయినా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాడు.వచ్చే ఏడాది వేసవి వరకు సినిమా వచ్చేలా బన్నీ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్లో సినిమాను ప్రారంభించేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంకా ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది.