వైరల్ వీడియో...వెహికిల్ పార్కింగ్ లో శునకం డ్యూటీ

మనం అనుకుంటాం కాని మనుషులు చేసే చాలా పనులు జంతువులు చేయగలవు.కాని వాటికి సరైన ట్రైనింగ్ ఇస్తే మనం చెప్పే ప్రతి పని చేస్తుంది.అందుకే చాలా మంది కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు.ఇంటికి రక్షణగా కొంత మంది పెంచుకుంటే కొంత మంది తమ ఇంట్లో మనిషిలా భావించి పెంచుకుంటారు.కాని ఓ కుక్క మాత్రం పార్కింగ్ సెక్యూరిటీ గార్డ్ గా ఉంటూ వెహికిల్స్ కు పార్కింగ్ సెన్సార్ గా పనిచేస్తోంది.నో పార్కింగ్ జోన్ లోనే పార్కింగ్ చేసే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో రూల్స్ ను పాటిస్తూ కార్ ను పార్కింగ్ చేసే వాళ్ళు చాలా అరుదుగా చూస్తుంటాం.

 Viral Video Dog Duty In Vehicle Parking , Viral News, Viral Video In Internet, D-TeluguStop.com

అసలు పార్కింగ్ రూల్స్ కూడా తెలియని మహానుభావులు కూడా ఉన్నారు.అసలు పార్క్ చేస్తే వేరే వెహికిల్స్ కు ఇబ్బంది అవుతుందా అని కూడా ఆలోచించకుండా స్థలం ఉంటే చాలు పార్కింగ్ చేస్తారు.

కానీ మీరిప్పుడు చూడబోయే వీడియోలో కుక్క తన యజమాని కారు పార్కింగ్ కు సెన్సార్ లా ఉంటూ కరెక్ట్ గా పార్క్ చేసే వరకు యాజమానిని గైడ్ చేస్తోంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.పార్కింగ్ రూల్స్ పాటించని వారు ఈ వీడియో చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube