టాలీవుడ్ ప్రేక్షకులకు త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దర్శకధీరుడు రాజమౌళి ప్రాణం పోసిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో తీవ్ర స్థాయిలో అంచనాలు పెరిగాయి.
ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో జత కట్టి పాన్ ఇండియా స్థాయిలో మెప్పించబోతున్నారు.ఇకరాజమౌళి ఈ సినిమా విడుదలను మార్చి 25న ప్రకటించగా గత కొన్ని రోజులుగా త్రిబుల్ ఆర్ మేనియా సాగుతుంది.
ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ గురించే చర్చలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సామాన్యుడికి అందనంత విధంగా టికెట్లు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక రేట్లు మాత్రమే కాదు బాహుబలి సినిమా తో పోలిస్తే త్రిబుల్ ఆర్ సినిమా కు కొన్ని మైనస్ లు ఉన్నాయని తెలుస్తుంది.
అవేమిటంటే.
బాహుబలి సినిమా మొత్తం కమర్షియల్ ప్యాకేజ్ డ్యూయట్లు, గ్లామర్ ఆ సినిమాకు ప్లస్ అయినట్లుగా అనిపించింది.ఇక త్రిబుల్ ఆర్ సినిమా విషయానికొస్తే ఇదొక ఎమోషనల్ ప్యాకేజీ మాత్రమే ఇందులో ఎలాంటి డ్యూయట్లు లేవు.
నాటు.నాటు పాట మాత్రమే ప్రేక్షకులు చిల్ అయ్యే విధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక బాహుబలి లో తమన్నా గ్లామర్, ఐటెం సాంగ్ లు ఇవన్నీ ప్రేక్షకులను మెప్పించే విధంగా మరో స్థాయిలో ఉన్నాయి.కానీ త్రిబుల్ ఆర్ విషయానికొస్తే నాటు నాటు పాట తప్ప మిగతా ఏ పాటలు కూడా మాస్ ఆడియన్స్ కు టేస్ట్ గా అనిపిస్తాయో లేదో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇక అన్నిటికంటే ముందు బాహుబలి సినిమా విడుదల సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు అన్ని ముగిసిపోయాయి.దాంతో మిడిల్ క్లాస్ విద్యార్థులు హాయిగా మూవీతో చిల్ అయ్యారు.కానీ త్రిబుల్ ఆర్ విడుదల సమయానికి టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇంకా ప్రారంభం కూడా కాలేదు.ఇక ఈ మైనస్ లు అన్నీ దాటుకొని త్రిబుల్ ఆర్ ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.







