ఓపెనర్ లేకుండా బీర్ బాటిల్ ఓపెన్ చేయడం ఒక పెద్ద టాస్క్.ఈ ప్రయోగాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు.
కొన్ని ప్రయోగాల్లో బాటిల్ పగిలిన సందర్భాలు ఉంటాయి.అయితే బీర్ ఓపెన్ చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అయితే లేటెస్ట్ గా ఓపెనర్ లేకుండా సరికొత్త విధానంతో బీర్ బాటిల్ ఓపెన్ చేశాడు ఓ వ్యక్తి.
ఇంతకీ అతను ఎలా బీర్ ఓపెన్ చేశాడో తెలుసా జస్ట్ షూ లేస్ తో.ఏంటి షూ లేస్ తోనా అని షాక్ అవ్వొచ్చు.అవును షూ లేస్ తోనే చాలా సింపుల్ గా బీర్ ఓపెన్ చేసి ఇచ్చేశాడు.
చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని షూ లేస్ ను దాని మూత పై చుట్టి సడెన్ గా లాగేశాడు అంతే.
ఓపెనర్ తో తీసిన దానిలానే బీర్ మూత అలా వచ్చేసింది.ఇది ఓ రకంగా ప్రయోగమే అని చెప్పాలి.మరి అలా ఎందుకు చేయాలని అనిపించిందో ఏమో కాని ప్రస్తుతం షూ లేస్ తో బీర్ ఓపెన్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది చూసిన కొందరు తాము కూడా ఇక మీదట ఓపెనర్ సహాయం లేకుండా షూ లేస్ తో బీర్ ఓపెన్ చేసేస్తాం అంటున్నారు.
మొత్తానికి తాగడానికి కొత్త కొత్త మార్గాలను వెతుకుతున్నారని చెప్పొచ్చు.షూ లేస్ తో బీర్ బాటిల్ మూత తీయడం అనేది క్రేజీ అనేస్తున్నారు నెటిజెన్లు.
ఈ వీడియో మాత్రం తెగ వైరల్ గా మారింది.
.Where there’s a will, there’s a way.🍺😎
— 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer)