సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం’‘( Guntur Karam ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు అనుకున్న సమయానికి ఈ సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.ఈ నెలలో మిగిలిన ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి చేస్తే జనవరి లో ఫ్రెష్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా నుండి కొన్నాళ్లుగా లీక్స్ వస్తూనే ఉన్నాయి.
మహేష్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా మరోసారి ఈ సినిమా లీక్స్( Guntur Karam Leaks ) బారిన పడింది.ఈ సినిమా నుండి మహేష్, శ్రీలీల డ్యాన్స్ చేస్తున్న చిన్న బిట్ లీక్ అయ్యింది.
దీంతో ఇది కాస్త వైరల్ అయ్యింది.ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా సాంగ్స్ షూట్ నుండే లీక్స్ జరగడం గమనార్హం.
ప్రజెంట్ లీక్ అయ్యిన బిట్ కూడా సాంగ్ లోనిదే.మరి ఇన్ని లీక్స్ వస్తున్న మేకర్స్ నుండి ఎలాంటి మూవ్ కనిపించడం లేదు.కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.