వైసీపీలో కొత్త ఇంఛార్జ్ ల నియామకం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తల నియామకంపై ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
నియోజకవర్గాల్లో పరిస్థితులు దృష్ట్యా మార్పులు, చేర్పులకు పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.గాజువాకలోనూ సమన్వయకర్తను మార్చాలని పార్టీ ఆదేశాలు ఇచ్చిందన్నారు.
ఈ క్రమంలో రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశామని చెప్పారు.మంచి అభ్యర్థికి సీట్లు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారని తెలిపారని పేర్కొన్నారు.
అదేవిధంగా మున్ముందు కూడా వైసీపీలో చాలా మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.