ఇల్లు, పర్యావరణం మనిషి జీవితంలో ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఏర్పాటు చేయడానికి సరైన దిశా, స్థలం ఖచ్చితంగా ఉండాలి.
ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేస్తే అది ఆ ఇంటి యజమాని జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది.శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వాస్తు శాస్త్రంలో జ్ఞాని అని చెప్పవచ్చు.
అందుకే పాండవుల ప్రథముడు యుధిష్టుడి( Yudhisthita ) పట్టాభిషేకం సమయంలో అతను అనేక వాస్తు నివారణ గురించి చెప్పాడు.అది ఇంటి నుంచి వాస్తు దోషాలను తొలగించి సుఖ సంతోషాలను తీసుకొని వస్తాయి.

శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పినా వాస్తు పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీకృష్ణుడి ప్రకారం ఆవు నెయ్యిని ఇంట్లో ఉంచడం ఎంతో శుభప్రదం.ఇది ఇంటిని స్వచ్చంగా, సుసంపన్నంగా ఉంచుతుంది.ఆవు నెయ్యి దీపం వెలిగించిన ఇంట్లో సకల పాపాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇంట్లో చందనం ఉంచడం వల్ల ప్రతికూలత దూరం అవుతుంది.వీలైతే ఇంటి దగ్గర గంధపు చెట్టును( Sandalwood tree ) పెంచాలి.
ఇది ఇంటి నుంచి అన్ని రకాల వాస్తు దోషాలను తొలగిస్తుంది.అలాగే ఎల్లప్పుడూ సానుకూలతను తీసుకొని వస్తుంది.
కావాలంటే చందనపు ముక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

అలాగే బ్రహ్మ సతీమణి సరస్వతి( Saraswati ) జ్ఞానానికి ప్రతిక అని దాదాపు చాలా మందికి తెలుసు.ఇంట్లో వీణా లేదా సరస్వతి తల్లి విగ్రహాన్ని ఉంచినట్లయితే అది కుటుంబ సభ్యుల జ్ఞానం కూడా పెరుగుతుంది.అందుచేత ఇంట్లో సరస్వతి అమ్మవారిని రోజు పూజిస్తూ ఉండాలి.
అలాగే ఇంట్లో నీటి వ్యవస్థ ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి.వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశను నీటికి ఉత్తమమైన దిశగా భావించవచ్చు.
అలాగే ఇంట్లో తేనెను ఉంచడం వల్ల ఆత్మను శుద్ధి చేస్తుంది.అందువల్ల పూజ కోసం ఇంట్లో తేనే ఉంచాలని పండితులు చెబుతున్నారు.