బానిస బతుకు అంటూ పవన్ కళ్యాణ్ పై అంబటి సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో బీజేపీతో… ఆంధ్రాలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ నువ్వు రాజకీయ విటుడివా.? బ్రోకర్ వా.? అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ వ్యభిచారం ఏంటో అర్థం కావటం లేదని అన్నారు.పవన్ ది బానిస బతుకు అంటూ విమర్శించారు.పవన్ చంద్రబాబు( Chandrababu ) పల్లకి మోయటానికే రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.వంగవీటి రంగాను అతి దారుణంగా హత్య చేసిన చంద్రబాబుకి బానిసవు నువ్వు, నువ్వు బానిసత్వం చేసేది కాక సామాజికవర్గం మొత్తాన్ని బాబుకు బానిసలుగా చేయాలనుకుంటున్నావా అంటూ ప్రశ్నించారు.

 Ambati Serious Comments On Pawan Kalyan For Living As A Slave , Ambati Rambabu,-TeluguStop.com
Telugu Ambati Rambabu, Janasena, Pawan Kalyan-Latest News - Telugu

ఏపీలో పొత్తులు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన… తెలంగాణలో ఎందుకు కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు.తెలంగాణలో కాంగ్రెస్ కి టీడీపీ మద్దతు తెలిపింది అనేది బహిరంగ రహస్యం.తెలంగాణ రాజకీయాల ప్రభావం ఏపీపై ఉండదని అన్నారు.తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమతో సత్సంబంధాలు ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది.ఇదే సమయంలో విశాఖ హార్బర్ లో పవన్ కళ్యాణ్ ₹50,000 చెక్ ఇచ్చి సీఎం జగన్( CM Jagan ) ని విమర్శించటం పట్ల అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ గడ్డం పెరిగిన ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణం అంటున్నారు.

రాష్ట్రంలో ఏది జరిగిన దానికి కారణం జగన్నే అని అనటం పవన్ కళ్యాణ్ కి అలవాటైపోయింది.మనోహర్ ఇచ్చిన స్లిప్పులో భాష పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ కి ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు, ఓటు హక్కు లేవు.అలాంటప్పుడు ఈ రాష్ట్రంతో ఆయనకు సంబంధం ఏంటి అని నిలదీశారు.

వచ్చే ఎన్నికలలో పవన్ ఎక్కడ పోటీ చేస్తారో కూడా క్లారిటీ లేదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube