మహేష్ బాబు( Mahesh Babu ) కెరియర్ లో ఆయన చేసిన చాలా సినిమాల్లో కొన్ని వరెస్ట్ సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాలు ఆయన ఇమేజ్ ని పెంచడం విషయం పక్కన పెడితే చాలా వరకు తగ్గించాయి అనే చెప్పాలి.
ఆ సినిమాలు ఏంటంటే మొదటగా వైవిఎస్ చౌదరి( YVS Chaudhary ) దర్శకత్వంలో వచ్చిన యువరాజ్ ( Yuvraj )అనే సినిమా.ఈ సినిమా ఆయన కెరియర్ లో ఒక వరెస్ట్ సినిమా అనే చెప్పాలి.
ఎందుకంటే అప్పటికి మహేష్ బాబు ఉన్న ఏజ్ కి ఆయన ఆ క్యారెక్టర్ చేయడం అనేది చాలా వరస్ట్ డెసిజన్ ఎందుకంటే అప్పటికి ఆయనకి రెండు మూడు సినిమాల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉండి ఒక పిల్లాడికి తండ్రి క్యారెక్టర్ చేయడం అనేది ఎవరు ఒప్పుకోలేని క్యారెక్టర్ అది… ఎందుకంటే 40 సంవత్సరాల పైన పడిన తర్వాత హీరోలు ఒక పిల్లవాడికి తండ్రిగా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.కానీ మహేష్ బాబు పాతిక ఏళ్లకే అలా చేయడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు.
మహేష్ బాబు ఒక స్టార్ రేంజ్ లో ఉన్నప్పుడు ఒక సినిమా చేశాడు దీనికి ఎస్ జే సూర్య( S J Surya ) దర్శకత్వం వహించాడు.ఈ సినిమా వెరైటీగా ఉన్నప్పటికీ మహేష్ బాబు రేంజ్ సినిమా కాదని ఆడియన్స్ ఈ సినిమాని తిప్పి కొట్టడం జరిగింది.ఇక ఆ తర్వాత మహేష్ బాబు పెద్దగా ప్రయోగాలు ఏమి చేయకుండా వరుసగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంటూ సక్సెస్ లను కొడితే ముందుకు వెళ్తున్నాడు.మహేష్ బాబు కెరీర్ లో వరెస్ట్ సినిమా గా చెప్పుకునే సినిమా వంశీ( Vamsi ).
మహేష్ బాబు ఈ సినిమా చేయాల్సింది కాదు కానీ స్టార్ డైరెక్టర్ అయిన బి గోపాల్( B.Gopal ) దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది.ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఇక దాని తర్వాత జయంత్ సి పరంజి డైరెక్షన్ లో వచ్చిన టక్కరి దొంగ సినిమా కూడా ఫ్లాప్ అయింది.