పూర్వికుల ఆశీర్వాదం మనపై ఉండాలని ఎప్పుడూ చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు.ఇందుకోసం సంవత్సరంలో 15 రోజులు చనిపోయిన వారి కోసం పితృపక్షం( Pitru Paksham )గా కేటాయించారు.
పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండగల జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం భద్రపదామాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది.
ఇది సంవత్సరంలో సెప్టెంబర్ 29 నుంచి మొదలవుతుంది.అలాగే అక్టోబర్ 14వ తేదీన ముగిస్తుంది.
పితృపక్షంలో రోజు ఉదయాన్నే నిద్ర లేచి నియమ నిష్కలతో పూజలు చేయాలి.ఆ తర్వాత పూర్వీకులను గుర్తు చేసుకుని దానధర్మాలు చేస్తూ ఉండాలి.
ఇంటి పై వాలే కాకులు ఇతర పక్షులు, జీవాలకు ఆహారం పెట్టాలి.పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెబుతున్నారు.అందుకే భోజనం ఏర్పాటులు చేసి ఉంచాలి.ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ( Garlic )ఉపయోగించకూడదు.పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయిన మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది.పక్ష కాలాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు.
కాబట్టి శుభ కార్యాలను అస్సలు చేయరు.పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకూడదు.
ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో మద్యపానం లేదా మాంసాహారానికి దూరంగా ఉండాలి.అలాగే షేవింగ్ చేయడం, గోళ్ళు కత్తిరించడం వంటివి చేయకూడదు.పితృపక్షంలో ఇంటి శుభ్రత పై శ్రద్ధ ఉంచాలి.కానీ సూర్యాస్తమయం( Sunset ) తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు.ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని కాళీ చేతులతో పంపకూడదు.వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వికుల పేరున పెట్టాలి.
DEVOTIONAL