ప్యాకేజీ మిల్క్ ఎలా తయారు చేస్తారో చూస్తే.. గుండె గుభేల్‌మంటుంది..

ఈ రోజుల్లో దాదాపు అన్ని ఆహార పదార్థాలకు కల్తీలు తయారు చేస్తూ కేటుగాళ్లు డబ్బులు దండుకుంటున్నారు.అలాగే సామాన్య ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.

 See How Packet Milk Is Getting Adulterated Video Viral Details, Packaged Milk Ad-TeluguStop.com

ముఖ్యంగా కల్తీ పాలను( Milk Adulteration ) తయారు చేసే వారి సంఖ్య పెరుగుతుంది.కల్తీ పాలు తయారుచేసి ప్యాకేజీల రూపంలో వాటిని ప్రజలకు అమ్మేస్తున్నారు.

రోజు ఎక్కడో ఒకచోట కల్తీ పాల తయారీ కేంద్రాలు బయటపడుతూనే ఉన్నాయి.తాజాగా నకిలీ పాలు ఎలా తయారు చేస్తారో చూపించే ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఒక గిన్నె నీటిలో గోధుమ రంగు రసాయనాన్ని పోశాడు.అంతే, ఆ మిశ్రమం పాలను( Milk ) పోలి ఉండే తెల్లటి ద్రవంగా మారుతుంది.

వీడియో క్యాప్షన్ రైతుల నుంచి మాత్రమే నేరుగా పాలు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించింది.ఈ వీడియోకు 5 లక్షల వరకు లైక్‌లు, కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.

బ్రౌన్ కెమికల్( Brown Chemical ) ఇండస్ట్రియల్ ఆయిల్ లేదా కటింగ్ ఆయిల్ అని పేర్కొంటూ నెటిజన్లు కామెంట్స్ విభాగంలో తమ ఆందోళనలను వ్యక్తం చేశారు.

ఇలాంటి వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు.కొన్ని సంవత్సరాల క్రితం, ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి.పాల లాంటి తెల్లటి ద్రావణం తయారు చేయడానికి హానికరమైన కెమికల్స్ ను కేటుగాళ్లు వాడుతున్నారని గత పరిశోధనలలో తేలింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నిర్వహించిన 2019 సర్వేలో 6,432 పాల శాంపిల్స్‌లో 12 కల్తీ కారణంగా మానవ వినియోగానికి హానికరంగా ఉన్నాయని తేలింది.ఇంకా, 77 నమూనాలు అనుమతించదగిన పరిమితులను మించి యాంటీబయాటిక్‌లను( Anti Biotics ) కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.అనేక నమూనాలు హైడ్రోజన్ పెరాక్సైడ్, అఫ్లాటాక్సిన్ M1, యూరియా, న్యూట్రలైజర్లు, డిటర్జెంట్ వంటి రసాయనాలతో కలుషితమైనట్లు కనుగొనబడ్డాయి.మొత్తం మీద ప్యాకెట్ పాలు ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.

అందుకే డైరెక్ట్ గా డెయిరీ ఫామ్ కి వెళ్లి కళ్ల ముందే పాలు ఇస్తేనే వాటిని తీసుకోవాలి, లేదంటే ప్రమాదాల్లో పడక తప్పదు.అది కుదరకపోతే మంచి పేరు ఉన్న బ్రాండెడ్ పాలు తీసుకోవడం శ్రేయస్కరం.

How Packet Milk is Made Viral Video

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube