హిందూ మతంలో మనం రాముడు, కృష్ణుడు, శివుడు, గణేశుడు లక్ష్మీ మొదలైన అనేక దేవుళ్లను పూజిస్తూ ఉంటాము.ఒక్కో దేవుడికి ఒక్కో పూజా విధానాలు, ఇష్టమైన ఆహార పదార్థాలు, పూలు, వాహనాలు ఉంటాయి.
పూజలో ఎన్నో రకాలు ఉన్నాయి.పూజ చేసే ముందు మనం వినాయకుడిని( Vinayaka ) ప్రార్థించి తండ్రి అన్ని అడ్డంకులు తొలగించండి అని ప్రార్థిస్తాము.
ఈ సంవత్సరం సెప్టెంబర్ 18 మరియు సెప్టెంబర్ 19వ తేదీన దాదాపు చాలామంది ఇళ్లలో వినాయకుడు వస్తున్నాడు.ఆ రోజున వినాయకుడికి నచ్చిన పూలు సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడని నమ్మకం.
కాబట్టి ఈ క్రింది పుష్పాలను గణేశ పూజకు( Ganesha Pooja ) వినియోగించి వినాయకుని అనుగ్రహాన్ని పొందాలి.
గణపయ్య పూజకు గరిక గడ్డి( Garika Gaddi ) తప్పనిసరిగా ఉండాలి.గరిక గడ్డి వాడకపోతే గణపయ్య పూజ అస్సలు పూర్తికాదు.గరిక లేకుండా వినాయకుడు తృప్తి చెందడు.
కాబట్టి వినాయకుడి పూజలో దీన్ని మాత్రం అసలు మిస్ చేయకూడదు.ఇంకా చెప్పాలంటే వినాయకుడికి ఎర్రటి పూలు అంటే ఎంతో ఇష్టం.
కాబట్టి ఎర్ర మందారాన్ని( Red Hibiscus ) పూజలో కచ్చితంగా ఉపయోగించాలి.ఇంకా చెప్పాలంటే పండ్లలో గణపయ్యకు దానిమ్మ పువ్వు అంటే ఎంతో ఇష్టం.
సాధారణంగా గణపయ్య పూజలో దానిమ్మ పువ్వు కచ్చితంగా ఉంటుంది.ఈ పువ్వు దొరకడం చాలా అరుదు.
అయినప్పటికీ పూజలో ఉంచితే శుభం కలుగుతుందని చెబుతారు.
ఇంకా చెప్పాలంటే శంఖపువ్వు( Shanku Flower ) సాధారణంగా తెలుపు మరియు నీలం రంగులో ఉంటుంది.శంఖం ఆకారంలో ఉండడం వల్ల దీనిని శంఖ పుష్పం అని అంటారు.ఇది ఇంట్లో కూడా సులభంగా పెంచవచ్చు.
ఇది మార్కెట్లో అమ్మడానికి అందుబాటులో లేవు.ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పువ్వు అంటే గణపయ్యకు ఎంతో ఇష్టం.
గన్నేరు పువ్వును సాధారణంగా సకల దేవతల పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు.ఈ పుష్పాన్ని నైవేద్యంగా పెడితే భయం తొలగిపోతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
DEVOTIONAL