కృష్ణాష్టమి సందర్భంగా టాలీవుడ్ నుండి రిలీజ్ అయినా మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty ) స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క మరో సినిమాతో రాలేదు.అందుకే ఈమె ఫ్యాన్స్ అంతా తన కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదే తరుణంలో ఎట్టకేలకు ఒక కొత్త సినిమా ఒప్పుకుని ఫినిష్ చేసింది.ఆ సినిమానే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.ఇది సెప్టెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’‘ ( Miss Shetty Mr Polishetty ).తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో మొదటి రోజు నుండే అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టి అదరగొడుతుంది.
ఇక నవీన్ పోలిశెట్టి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా మరింత స్థాయిలో దూసుకెళ్తుంది.యూఎస్ ( US )లో అయితే అదిరిపోయే కలెక్షన్స్ ముందు నుండి రాబడుతుంది.ఇక తాజాగా ఈ సినిమా లేటెస్ట్ గా గడిచిన వారం టాప్ 20 చిత్రాల లిస్ట్ లో చేరినట్టు తెలుస్తుంది.టాప్ 20 చిత్రాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అలాగే అదే రోజు రిలీజ్ అయినా క్వాన్ కూడా నిలిచింది.
జవాన్ యూఎస్ మార్కెట్ లో టాప్ 6లో నిలవగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 18వ స్థానంలో నిలిచింది.మిగిలిన సినిమాలు హాలీవుడ్ సినిమాలే.ఇలా యూఎస్ లో స్ట్రాంగ్ హోల్డ్ తో టాప్ 20 లో నిలిచి ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కాగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కించగా యువీ క్రియేషన్స్ వారు నిర్మించారు.