మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలు నాటితే ఎంత ప్రమాదమో తెలుసా..?

సాధారణంగా చాలామంది ఇంటి చుట్టూ మొక్కలను పెంచుతూ ఉంటారు.అయితే అలాంటి మొక్కలలో కొన్ని మొక్కల వద్ద పాములు నివసిస్తూ ఉంటాయి.

 Do You Know How Dangerous It Is To Plant These Plants Around Your House , Plants-TeluguStop.com

అయితే అలాంటి మొక్కలు మన ఇంటి చుట్టూ ఉండడం చాలా ప్రమాదం.అయితే ఏ మొక్కల వలన మనకు ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.

జాస్మిన్ మొక్కల దగ్గర పాములు నివసించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే జాస్మిన్ మొక్క( Jasmine ) చాలా దట్టమైనది.

అలాగే పాము దాని రంగులో కప్పబడి ఉంటుంది.పాము దాక్కున్న తర్వాత తన ఎరను సులభంగా పట్టుకుంటుంది.

Telugu Cypress, Devadaru Tree, Jasmine, Lemon Tree, Vasthu, Vasthu Tips-Telugu B

మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఇదే.సైప్రస్( Cypress ) చాలా అందంగా కనిపించే మొక్క.చాలా మంది ఇంటి దగ్గర పెంచుతూ ఉంటారు.కానీ ఆ మొక్క కూడా చాలా దట్టమైనది అని చెప్పవచ్చు.ఇది దట్టంగా ఉండడం వలన పాములు అందులో దాక్కొని కీటకాలను వేటాడుతాయి.ఇక క్లోవర్ మొక్కలు కూడా అలంకారమైన మొక్కలు అని చెప్పాలి.

అయితే దీని ఆకులు కూడా మందంగా, దట్టంగా ఉంటాయి.అవి భూమిని పూర్తిగా కప్పేయడం వలన పాములు ఆకు కింద హాయిగా చుట్టుకోని, కూర్చుని రహస్యంగా, తమ ఆహారం వెతకడం కోసం దాక్కొని ఉంటాయి.

Telugu Cypress, Devadaru Tree, Jasmine, Lemon Tree, Vasthu, Vasthu Tips-Telugu B

ఇక నిమ్మ చెట్టు లేదా సిట్రస్ చెట్టు వద్ద ఎలుకలు అలాగే చిన్న పక్షులు నివసిస్తూ ఉంటాయి.ఎందుకంటే ఈ చెట్టు యొక్క పండ్లను తినడానికి కీటకాలు, పక్షులు అక్కడ నివసిస్తూ ఉంటాయి.కాబట్టి ఈ పాములు కూడా నిమ్మచెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాయి.ఇక దేవదారు వృక్షాలు కూడా చాలా ఎత్తైన ప్రదేశాలలో పెరిగినప్పటికీ మైదానాలలో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి.

అందుకే మైదానంలో చాలామంది దేవదారు చెట్లను నాటుతుంటారు.అయితే పాము దేవదారు చెట్టులో చుట్టుకొని ఆనందిస్తుంది.కాబట్టి దేవదారు చెట్టు( Devadaru Tree ) ఇంటి చుట్టూ నాటకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube