షార్ట్‌కర్ట్ కోసం ఏకంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేసిన ప్రబుద్ధులు..!

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా( Great Wall of China ) ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి.ఇది చాలా పెద్దగా ఉంటుంది.

 The Intellectuals Who Dug The Great Wall Of China Together For A Short Cut, Chin-TeluguStop.com

అయితే షార్ట్ కట్ కోసం ఇద్దరు వ్యక్తులు ఈ గోడలోని కొంత భాగానికి బొక్క పెట్టి పాడు చేశారు.అందుకు ఒక యంత్రాన్ని ఉపయోగించారు.

ఈ ఇద్దరు వ్యక్తులను చైనా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.వారిలో 38 ఏళ్ల మగవ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఉన్నారు.

Telugu Big Gap Dug, China, Chinese, Wall China, Latest, Nri-Telugu NRI

సెంట్రల్ షాంగ్సీ ప్రావిన్స్‌( Central Shaanxi Province )లోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా భాగాన్ని పాడు చేసిన ఈ ఇద్దరు వ్యక్తులు దాని ద్వారా షార్ట్‌కట్‌ను సృష్టించాలనుకున్నారు.తాము ప్రయాణించాల్సిన దూరాన్ని తగ్గించుకోవాలని భావించి ఇలా చేశారు.వారు ఉపయోగించిన ఎక్స్‌కవేటర్‌ వల్ల గోడకు చాలా నష్టం వాటిల్లింది, ఇప్పుడు గోడ మరమ్మతులకు కూడా నోచుకోలేని స్థితికి చేరుకుంది.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మైలురాళ్లలో ఒకటి.ఇది అనేక శతాబ్దాలుగా నిర్మించడం జరిగింది.

వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది.

Telugu Big Gap Dug, China, Chinese, Wall China, Latest, Nri-Telugu NRI

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రభుత్వం రక్షిస్తున్న చారిత్రక, సాంస్కృతిక ప్రదేశం.ఇది చైనాకు చాలా ముఖ్యమైనది.గోడను పాడు చేసిన ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు.

సంవత్సరాలుగా, చాలా మంది ప్రజలు వివిధ కారణాల వల్ల గోడ భాగాలను ధ్వంసం చేశారు.దీనిని రక్షించడానికి చైనా ప్రభుత్వం కఠినమైన శిక్షలు తీసుకొచ్చింది.

ఆ శిక్షల వల్ల ఇప్పుడు దానిని తవ్విన ఇద్దరూ పెద్ద చిక్కుల్లో పడినట్లు అయింది.ఇక చైనా ప్రభుత్వం గ్రేట్ వాల్ పరిరక్షణకు చర్యలు కూడా తీసుకుంటోంది, అయితే ఇది చాలా కష్టమైన పని.ఎందుకంటే గోడ చాలా పొడవుగా ఉంది, అనేక రకాల శిథిలావస్థలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube