Anchor Suma: ట్రెండీ వేర్ లో సుమ… ఈ యాంగిల్ లో సుమక్కని అస్సలు చూసుండరుగా… ఫోటో వైరల్!

బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా స్టార్ మహిళగా కొనసాగుతున్నటువంటి వారిలో యాంకర్ సుమ( Anchor Suma ) ఒకరు.గత పాతికేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సొంతం చేసుకున్నటువంటి సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Anchor Suma Kanakala Stunning Photo Shoot New Angle From Her-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో బుల్లితెరపై అలాగే సినిమాలలోనూ నటిస్తూ సందడి చేశారు.అయితే ప్రస్తుతం ఈమె యాంకర్ గా స్థిరపడ్డారనే విషయం తెలిసింది.

ఈ విధంగా బుల్లితెర యాంకర్ గా అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ తన మాటలతో అందరిని నవ్విస్తూ సందడి చేసే సుమకు( Suma ) హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇలా రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సుమ తన వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

వారంలో ఏడు రోజులపాటు ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమా వేడుకలు బుల్లితెర కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతూ ఉంటుంది.

ఇక ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే పెద్ద ఎత్తున గ్లామర్ షో( Glamor Show ) చేయాల్సిన పనిలేదని మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సుమ నిరూపించారు.ఇప్పటికే యంగ్ టాలెంటెడ్ యాంకర్స్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే వీరంతా కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ యాంకర్లుగా( Anchors ) కొనసాగుతున్నారు.

అయితే సుమ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పాలి.చాలా సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి ఎంతో నిండుగా కనిపిస్తుంటారు.

అయితే ఈ మధ్యకాలంలో సుమ కూడా కాస్త ట్రెండ్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.బుల్లితెర కార్యక్రమాలలో భాగంగా ఈమె ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతూ లేటెస్ట్ ట్రెండీ వేర్ ధరిస్తూ( Trendy Wear ) అభిమానులను సందడి చేస్తున్నారు.తాజాగా ఈమె బ్లాక్ మరియు గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా సుమ ట్రెండీ వేర్ లో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో సుమక్కలో కూడా ఈ యాంగిల్ ఉందా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.అయితే ఈమె ట్రెండీ వేర్ ధరించిన ఎక్కడ గ్లామర్ షో చేయకుండా క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ దిగినటువంటి ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ ట్రెండీ వేర్ లో కూడా సుమక్క కేక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube