దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లర్ల వేధింపుల కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ విచారణకు హాజరయ్యారు.
అయితే బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెల రోజులపాటు ఆందోళనలు చేపట్టారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బ్రిజ్ భూషణ్ పై 354, 354 ఏ, 354 డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో దాదాపు 1599 పేజీల భారీ ఛార్జీషీటును కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.