చాలామందికి కొన్ని ఫుడ్ అలర్జీలు ఉంటాయి.కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు.
తమకు నచ్చనివాటిని తినేందుకు ఆసక్తి చూపరు.వాటి చూస్తేనే అలర్జీ వస్తుంది.
అయితే చిన్నపిల్లలు కూడా అంతే.వారికి నచ్చని పదార్థాలను అసలు తినరు.
బలవంతంగా తినిపించినా కూడా తినరు.అయితే చిన్న వయస్సులో పిల్లలు ఎదుర్కొనే ఫుడ్ అలర్జీలు ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తున్నట్లు శాస్త్రవేత్తలు( Scientists ) గుర్తించారు.
ఆస్ట్రేలియాలోని ముర్డోక్ చిల్డ్రన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు( Murdoch Children’s Research Institute, Australia ) చెందిన శాస్త్రవేత్తలు చిన్నపిల్లల్లో ఫుడ్ అలర్జీలపై ఒక పరిశోధన చేపట్టారు.దాదాపు 5,276 మంది పిల్లలను పరీక్షించారు.వారికి ఏయే పదార్థాలు చూస్తే అలర్జీ వస్తుందనే విషయంతో పాటు వాటి వల్ల ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని పరిశీలించారు.ఈ పరిశోధన ప్రకారం ప్రతి 13 మంది పిల్లల్లో ఒకరు ఫుడ్ అలర్జీకి గురవుతున్నట్లు గుర్తించారు.
అలర్జీకి గురి చేసే ఆహారం తీసుకోగానే రోగనిరోధక వ్యవస్థ అతిగి ప్రతిస్పందిస్తున్నట్లు నిర్ధారించారు.
ఆస్ట్రేలియాలో ఎక్కువమంది పిల్లలు ఫుడ్ అలర్జీలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.రొయ్యలు, వేరుశెనగ, నువ్వులు, గుడ్డు, ఆవుపాలు వంటికి కూడా అలర్జీకి కారణమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.అలాగే జీడిపప్పు, బాదం, హాజెల్ నట్ వంటి అలర్జీలు కూడా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను కారణమవుతున్నట్లు గుర్తించారు.
అయితే అన్నీ అలర్జీలు( Allergies ) ప్రమాదకరమైనవి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.తరచూ అలర్జీలకు గురవుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల అలర్జీల బారిన పడకుండా చూసుకోవచ్చంటున్నారు.ఏడాది వయస్సు గల పిల్లల్లో నాలుగు ఆహార అలర్జీలను సైంటిస్టులు గుర్తించారు.
ఆస్ట్రేలియాలో 10 శాతం కంటే ఎక్కువమంది పిల్లలు ఆహార అలర్జీలను ఎదుర్కొంటున్నట్లు పరిశోధనలో తేలింది.దీంతో పిల్లలకు ఫుడ్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.