కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యమ దూకుడు ప్రదర్శిస్తోంది.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka assembly elections ) విజయం సాధించిన హస్తం పార్టీ.
అదే ఫలితాన్ని తెలంగాణలో కూడా రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు, ప్రణాళికలతో కాంగ్రెస్ తెగ హడావిడి చేస్తోంది.
ఇప్పటికే పార్టీలో ఎన్నికల లక్ష్యంగా ఆయా నేతలపై కీలక బాధ్యతలు భుజాన వేసింది.ఇక ఇప్పుడు అభ్యర్థుల విషయంలో కసరత్తులు ప్రారంభించింది.
ఈసారి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో అభ్యర్థుల ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా బీసీ ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో బీసీ సంఘాలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసి.బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని హస్తంపార్టీ భావిస్తోంది.అయితే కాంగ్రెస్ బీసీ స్లోగాన్ ఎంచుకుంటే తమకు తిప్పలు తప్పవని బావించిన అధికార బిఆర్‌ఎస్( Brs ) కూడా బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఇప్పటికే బీసీ నేతలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
దీంతో అటు అధికార బిఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్( Congress ) రెండు పార్టీలు కూడా బీసీ ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ కంటే ముందే అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ ఈసారి సీట్ల పంపకాలలో బీసీలకు అధిక ప్రదాన్యం ఇవ్వబోతున్నాట్లు ఇప్పటికే హింట్ ఇచ్చింది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.దాదాపు ముప్పై సీట్ల మేర బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తున్నాట్లు సమాచారం.ఇదే గనుక నిజం అయితే బిఆర్‌ఎస్ కు తిప్పలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.ఎన్నికల్లో బీసీ ఓటర్ల ప్రభావం గట్టిగా ఉంటుంది.అందువల్ల కాంగ్రెస్ ఆ స్థాయిలో బీసీలకు సీట్లు కేటాయిస్తే.ఓటర్ల దృష్టి కాంగ్రెస్ పై పడే అవకాశం ఉంది.
దీంతో హస్తం పార్టీ వ్యూహానికి బిఆర్‌ఎస్ ఒక్కసారిగా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఎందుకంటే అధికార బిఆర్‌ఎస్ కూడా ఆ స్థాయిలో బీసీలకు సీట్లు కేటాయిస్తే.
ఇతరుల నుంచి తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉంది.మరి బీసీ స్లోగాన్ తో హస్తం పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంటే.
అధికార బిఆర్‌ఎస్ కాంగ్రెస్ వ్యూహాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.