గన్నవరం నియోజకవర్గం( Gannavaram Constituency )లో వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు అనే పరిస్థితి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుండి పోటీ చేసిన యార్లగడ్డ… వంశీ( Vallabhaneni Vamsi ) చేతిలో ఓటమిపాలయ్యారు.అయితే ఆ తర్వాత వంశీ అనధికారికంగా వైసీపీ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.దీంతో అప్పటినుండి గన్నవరం వైసీపీలో గ్రూపు వార్ లు జరుగుతున్నాయి.ఇదంతా పక్కన పెడితే వచ్చే ఎన్నికలలో సైతం వైసీపీ అరిష్టానం వంశీకే టికెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది.ఇలాంటి పరిస్థితులలో తాజాగా యార్లగడ్డ వెంకట్రావు .( Yarlagadda Venkata Rao ) వచ్చే ఎన్నికలలో గన్నవరం నుంచే పోటీ చేయబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విషయంలోకి వెళ్తే సోమవారం ఓ కేసు విషయమై కోర్టు వాయిదాకు వెళుతూ హనుమాన్ జంక్షన్ లో దుట్టా రామచంద్రరావుతో.
మరి కొంతమంది పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా తాను టీడీపీ( TDP ) లోకి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో రానున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ( YCP ) నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయంపై సీఎం జగన్ తో సమావేశం అనంతరం నిర్ణయం తెలియజేస్తానని మీడియాతో స్పష్టం చేశారు.ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు వ్యాఖ్యానించారు.