పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వాలంటీర్ల వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ( YCP ) ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
వాలంటీర్ల పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధిత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.ఈ పరిణామంపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఆల్రెడీ అమిత్ షాతో( Amit Shah ) మాట్లాడటం జరిగింది.ఇటువంటి కేసులకు భయపడితే నేను పార్టీ ఎందుకు పెడతా.
నేను మాట అన్నానంటే ఎంత రిస్క్ అయినా తీసుకుంటా.దెబ్బలు తినటానికి జైలుకెళ్లటానికైనా నేను రెడీ.
సై అంటే సై అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని( perni nani ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.డేటా చోరీపై అమిత్ షా, ప్రధాని మోదితో నిరూపించాలని సవాల్ విసిరారు.పవన్ కళ్యాణ్ దేనికైనా సిద్ధమంటే తాము కూడా రెడీ అని సవాల్ విసిరారు.
సై అంటే సై అని స్పష్టం చేశారు.బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ కి బలమైన బంధం ఉంటే ఎవరికి ఉపయోగమని వ్యంగ్యంగా విమర్శించారు.
అమిత్ షాతో మాట్లాడితే ఏం జరుగుతుంది అంటూ.పేర్ని నాని ప్రశ్నించారు.
సీఎం జగన్ జైలుకు పంపుదామని సొల్లు మాటలు మాట్లాడుతున్నారు.ప్రజలు బాగుండాలంటే జగన్ పోవాలన్నా చేసిన వ్యాఖ్యలకు,.
ప్రజలు బాగుండాలంటే జగన్ ప్రభుత్వం రావాలని పేర్ని నాని స్పష్టం చేశారు.చేతనైతే బీజేపీ, టీడీపీ, జనసేన కలసి సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటూ సవాల్ చేశారు.