మిల్కీ బ్యూటీ తమన్నా( Tamannaah ) హ్యాపీ డేస్ సినిమా తర్వాత అనూహ్యంగా స్టార్ గా మారిన విషయం తెల్సిందే.హీరోయిన్ గా ఈమె చేస్తున్న సినిమా లు ప్రస్తుతం పెద్దగా ఏమీ లేవు.
ప్రాముఖ్యత లేని పాత్రలను పెద్దగా క్రేజ్ లేని సినిమా ల్లో ఐటం సాంగ్స్ చేస్తుంది.అయితే ఈ అమ్మడి యొక్క పారితోషికం మాత్రం ఓ రేంజ్ లో ఉంది.
హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా డిమాండ్ చేస్తున్న పారితోషికం అందరికి కూడా షాకింగ్ గా ఉంది.ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోయిన్స్ కొందరు కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు.
వారికి ఏమాత్రం తగ్గకుండా మిల్కీ బ్యూటీ తమన్నా కోటిన్నర రూపాయల పారితోషికంను డిమాండ్ చేస్తుందట.ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేయడం చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు.హీరోయిన్ గా చేయకున్నా కూడా మరీ ఇంతనా అంటూనే కొందరు ఓకే చెప్పి ఆమెను తమ సినిమాల్లో నటింపజేస్తున్నారు.సాధారణంగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )వంటి హీరోయిన్స్ కోటి రూపాయల లోపు పారితోషికం తీసుకుంటున్నారు.
కానీ తమన్నా మాత్రం కోటిన్నర పారితోషికం తీసుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నెట్టింట తమన్నా యొక్క పారితోషికం విషయం వైరల్ అవుతోంది. మిల్కీ బ్యూటీ( milky buty ) ఇటీవల వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది.అక్కడ బోల్డ్ గా నటించినందుకు గాను ఇంకాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుందట.
మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట.మొత్తానికి తమన్నా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా లక్ తో ఈ రేంజ్ లో పారితోషికం తీసుకుంటుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమన్నా మరో అయిదు ఏళ్ల పాటు హీరోయిన్ గా ఇదే రేంజ్ లో దూసుకు పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.