తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 23, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.47

 Daily Horoscope, Jathakam, June 23 2023,పంచాంగం, రాశి ఫ�-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.9.15 ల10.15 సా6.00 ల7.30

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.

ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వ్యాపారస్థులకు కొన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి.

మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిత్వం కోల్పోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తవుతుంది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో ప్రయాణాలు చేస్తారు.ప్రయాణంలో కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడమే మంచిది.

తుల:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ధన లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం వుంది.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసే ముందు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.తొందరపడి ఎవరిని నమ్మకండి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితుడి నుండి సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు మీ శత్రువులు మీకు దగ్గరవుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube