ఇటీవల ఛాట్ జీపీటీ( Chat GPT ) గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.సోషల్ మీడియాలో ఎక్కడబట్టినా దీని గురించే చర్చ.
టెక్నాలజీ ప్రపంచంలో ఇదొక సంచలనంగా మారింది.ఛాట్ జీపీటీ రాకతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) గురించి అందరికీ తెలిసిపోయింది.
ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగం మరింతగా పెరిగింది.ఛాట్ జీపీటీకి పోటీగా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే ఫ్లాట్‌ఫామ్‌లు పుట్టుకొస్తున్నాయి.
ఛాట్ జీపీటీ లాంటి ఫ్లాట్‌ఫామ్‌లు అనేకం పుట్టుకొస్తున్నాయి.
అయితే ఛాట్ జీపీటీ తయారుచేసిన సంస్థలో పనిచేసే సీఈవో జాబ్( CEO job ) ఎలా సంపాదించాలనే దానిపై కొన్ని సీక్రెట్లు బయటపెట్టాడు.ఉద్యోగం పొందాలంటే ఆన్‌లైన్‌లో వేకెన్సీలు చూసి దరఖాస్తు చేసుకోవాలి.లేదా కన్సల్టెన్సీ ఏజెన్సీల ద్వారా ఉద్యోగం సంపాదించవచ్చు.
అలాగే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి రిఫరెన్స్ ద్వారా అయినా ఉద్యోగం సంపాదించవచ్చు.అయితే ఛాట్ జీపీటీని తయారుచేసిన ఓపెన్ ఏఐ అనే సంస్థ వినూత్న ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది.
ఓపెన్ ఏఐ కంపెనీ( Open AI Company ) ఆఫర్ చేస్తున్న అప్లికేషన్లను కొని కొత్త ప్రొడక్టులను తయారుచేయండి.అనంతరం వాటిని సీఈవోకి పంపించండి.వాటిని సీఈవో రివ్యూ చేసి నచ్చితే మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశముందని చెబుతోంది.ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్ వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా తాజాగా భారతదేశాన్ని సందర్శించారు.ఢిల్లీలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్ ( CEO Sam Altman )ముచ్చటించారు.
ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఈ క్రమంలో ఒక విద్యార్థి మీ సంస్థలో ఎలా ఉద్యోగి సంపాదించాలని ప్రశ్నించాడు.
దీనికి సమాధానంగా పై విధంగా సీఈవో సమాధానమిచ్చారు.భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు.
భారత్ లో ఏఐ వినియోగంపై చర్చించారు.