ఒకానొక సమయంలో వెండితెరపై సంచలనాలను సృష్టించినటువంటి వారిలో నటి షకీలా( Shakeela ) ఒకరు.ఒకప్పుడు ఇవే సినిమాలలో నటిస్తున్నారంటే ఈమె కోసమే సినిమాలు చూడటానికి వెళ్లేవారు.
అలాగే షకీలా సినిమా విడుదలవుతుంది అంటే స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల వాయిదా వేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ విధంగా షకీలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా భారీగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు ఏ మాత్రం లేవు ఏదో అడపాదడపా బుల్లితెర కార్యక్రమాలలోనూ, రియాలిటీ షోలలో నటిస్తూ కాలం వెళ్ళదిస్తున్నారు.

ఇకపోతే ఈమె భారీగా ఆస్తులు కూడా పెట్టారని ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల( BMW Car ) లో తిరుగుతూ తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు అంటూ పెద్ద ఎత్తున షకీలా గురించి వార్తలు వచ్చాయి.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి షకీలా ఈ వార్తలపై స్పందిస్తూ అందులో ఏమాత్రం నిజం లేదని తన గురించి వచ్చే ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమేనని తెలియజేశారు.తాను బీఎండబ్ల్యూ కార్లలో తిరగడం ఏంటి కనీసం ఉండటానికి సొంత ఇల్లు( Own House ) కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకానొక సమయంలో సినిమాలలో నటిస్తూ నటిగా తాను రోజుకు నాలుగు లక్షల వరకు సంపాదించిన మాట వాస్తవమేనని తెలిపారు.ఇలా సంపాదించినది మొత్తం నా పేరు మీద ఉంటే ఇన్కమ్ టాక్స్ అధికారుల వల్ల ఇబ్బంది తలెత్తుతుందని తన అక్క మాయ మాటలు చెప్పి తన ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకొని నన్ను దారుణంగా మోసం చేసిందని మరోసారి ఈమె తనకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పారు.ఇలా అయినవాళ్లే ఆస్తి కోసం నన్ను దారుణంగా మోసం చేశారని అలాంటప్పుడు నేను బీఎండబ్ల్యూ కార్లలో ఎలా తిరుగుతానని ఈమె తెలిపారు.కనీసం ఉండటానికి కూడా సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో( Rent House ) కాలం వెళ్ళదిస్తున్నానంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.