హెయిర్ ఫాల్ తో తీవ్రంగా బాధపడుతున్నారా.. ఈ డ్రింక్ తాగితే ఒక్క వెంట్రుక కూడా రాలదు!

హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారా.? ఎన్ని రకాల హెయిర్ ప్యాక్ ( Hair pack )లు, మాస్కులు వేసుకున్న జుట్టు రాలడం తగ్గడం లేదా.? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను చేర్చుకోవాల్సిందే.ఈ డ్రింక్ తాగితే ఒక్క వెంట్రుక కూడా రాలదు.

 Magical Drink For Stopping Heavy Hair Fall! Magical Drink, Heavy Hair Fall, Hair-TeluguStop.com

హెయిర్ ఫాల్ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా రెండు లేదా మూడు ఉసిరికాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అలోవెరా( Aloe vera ) ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Heavy Fall, Magical-Telugu Health

అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర( Coriander ), రెండు స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Pepper powder ), పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, చిటికెడు పసుపుతో పాటు ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని నేరుగా సేవించాలి.రెండు రోజులకు ఒకసారి ఈ డ్రింక్ ను తాగితే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

కుదుళ్లు బలోపేతం అవుతాయి.

Telugu Care, Care Tips, Fall, Heavy Fall, Magical-Telugu Health

జుట్టు రాలడం చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బ్ల‌డ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

క్యాన్సర్, ఆల్జీమర్స్ వాటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు చర్మం కూడా యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube