హిందూ మతం లో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ఏకాదశిని హిందువులు పరమపవిత్రమైన రోజుగా భావిస్తారు.
ప్రతి నెలలోనూ రెండు ఏకాదశిలు వస్తాయి.ఒకటి శుట్లపక్షంలో, రెండవది కృష్ణపక్షంలో వస్తాయి.
అయితే జేష్ట మాసంలో వచ్చే శుట్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి( Nirjala Ekadashi ) అని పిలుస్తారు.ఈ సంవత్సరం ఏకాదశి మే 31వ తేదీన వస్తుంది.
ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు దూరమై కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే నిర్జల ఏకాదశి రోజు పొరపాటున కూడా లక్ష్మీదేవి( Goddess Lakshmi )కి అత్యంత ఇష్టమైన తులసి మొక్క వద్ద ఎటువంటి తప్పులు చేయకూడదని కూడా చెబుతున్నారు.హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తుందని గట్టిగా నమ్ముతారు.అంతేకాకుండా లక్ష్మీదేవి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటుందని చెబుతారు.
అందుకే ఈరోజు తులసి మొక్కను( Tulsi plant) నీళ్లు పోయకూడదు.ఏకాదశి రోజున తులసి ఆకులను ఎప్పుడూ తుంచకూడదు.
తులసి ఆకులు ఎప్పుడూ అవసరమైన ఏకాదశి రోజు కాకుండా అంతకు ముందు రోజు మాత్రమే తెంచి పెట్టుకోవాలి.
తులసి ఆకులను గోళ్ళతో గిల్లడం మహా పాపం.తులసి ఆకులు తుంచడానికి ముందు తులసి మొక్కకు నమస్కరించి మరీ తుచడం ఎంతో మంచిది.మురికి చేతులతో లేదా మైల పడిన శరీరంతో తులసి ఆకులను ఎప్పుడు తాకకూడదు.
ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.లక్ష్మీదేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు.లక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా పరమ పవిత్రంగా భావించే తులసి మొక్కను ఆరోజు మంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది.
అందుకే నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క విషయంలో ఈ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి.
DEVOTIONAL