తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌( Congress party ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.హంగ్ తప్పదు అంటూ చాలా మంది చెప్పినా కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని సొంతంగానే ప్రభుత్వంను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది.

 Rahul Gandhi Bharat Jodo Yatra Effect In Telangana , Rahul Gandhi , Ts Politi-TeluguStop.com

అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ దక్కించుకోవడానికి కారణం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా చెబుతున్నారు.ఈ సమయంలో రాహుల్‌ గాంధీ( Rahul Gandhi ) యొక్క జోడో యాత్ర ప్రభావం దేశంలో ఎలా ఉంటుంది అంటూ ఆయా రాష్ట్రాల ముఖ్య నాయకులు మరియు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

Telugu Congress, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Ts-Politics

రాహుల్‌ గాంధీ యొక్క భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా సాగిన విషయం తెల్సిందే.ఆ సమయంలో రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికల హడావుడి ఉంది కనుక మీడియాలో ఎక్కువ ఫోకస్ అవ్వలేదు.దాంతో తెలంగాణ లో కాంగ్రెస్( Telangana ) బలం పెద్దగా పెరిగి ఉండదు అనేది కొందరి విశేషణ.ఎలాంటి అనుమానం లేకుండా అద్భుతమైన బలం తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అంటూ కొందరు వాదిస్తున్నారు.

Telugu Congress, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Ts-Politics

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలం అనూహ్యంగా పెరిగింది.కనుక ముందు ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బలమైన పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ వ్యవహరించిన తీరు కారణంగానే దేశ వ్యాప్తంగా కూడా అనూహ్యంగా బలం పుంజుకున్నట్లుగా కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఆ ఎన్నికల్లో కూడా రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రభావం ఉండబోతుంది అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ లో ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube