తాజాగా ఆదివారం పంజాబ్- హైదరాబాద్( Sunrisers Hyderabad ) మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.పంజాబ్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ ఓపెనర్ గా వచ్చి 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ లతో 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
ఒకవైపు పంజాబ్ జట్టు వరుసగా వికెట్లను కోల్పోతున్న జట్టుకు వెన్నుముకలాగా చివరి బంతి వరకు నిలబడి అద్భుత ఆటను ప్రదర్శించాడు.
పంజాబ్ జట్టు 88 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది.
ఇక 100 పరుగులు కూడా చేయలేదు అనుకున్నారు.కానీ శిఖర్ ధావన్( Shikhar Dhawan ) చివరి బ్యాటర్ తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యం జోడించాడు.
పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.హైదరాబాద్ జట్టు 17.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
పంజాబ్ జట్టు ఓడిన కెప్టెన్ శిఖర్ ధావన్ ఖాతాలో ఓ సరికొత్త రికార్డు పడింది.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ పై ఉండే రికార్డును శిఖర్ ధావన్ బ్రేక్ చేసేసాడు.విరాట్ కోహ్లీ( Virat Kohli ) 216 ఇన్నింగ్స్ లలో ఆడి 50 అర్థ సెంచరీలు సాధించాడు.
తాజాగా శిఖర్ ధావన్ 206 ఇన్నింగ్స్ లలో 51 అర్థ సెంచరీలు సాధించాడు.దీనితో ఐపీఎల్ లో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు.
అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన ఆటగాడు ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.ఇతను ఇప్పటివరకు ఐపీఎల్ లో 60 అర్థ సెంచరీలు సాధించాడు.శిఖర్ ధావన్ తాజాగా జరిగిన మ్యాచ్ పై స్పందిస్తూ ఇది తన కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటున్నట్లు తెలిపాడు.తమ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంటే చివరివరకు నిలబడాలని అనుకున్నట్లు, ఒక పరుగుతో సెంచరీ మిస్ అయిందన్న బాధ కంటే ఈ ఇన్నింగ్స్ గొప్పగా ఆడను అనే సంతోషం చాలు అని తెలిపాడు.