సీతారాముల కళ్యాణానికి హాజరై రామ భక్తిని చాటిన హనుమంతుల సైన్యం.. ఎక్కడంటే..!

రామాయణ గాధలో సీతారాములు, లక్ష్మణుల గురించి ప్రస్తావించిన తర్వాత గుర్తుకు వచ్చే ముఖ్యమైన వ్యక్తి హనుమంతుడు.ఈయన లేనిదే రామాయణం లేదని దాదాపు ప్రజలందరూ భావిస్తారు.

 The Hanuman Attended Seetharama Kalyanam And Showed Devotion To Rama , Sita ,-TeluguStop.com

అపర భక్తుడిగా ఆంజనేయుడు పేరు తెచ్చుకున్నాడు.ఎక్కడా రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని భక్తులు భావిస్తూ ఉంటారు.

అంజనీ సుపుత్రుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఆయనకు ప్రత్యేకంగా బ్రహ్మచారులు మంగళవారం రోజు పూజిస్తూ ఉంటారు.

అందుకే రామున్ని పూజిస్తే ఖచ్చితంగా హనుమంతుని ప్రసన్నం చేసుకున్నట్లేనని ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న రామాలయాలన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి.ప్రతి రామాలయం లోనూ సీతారాములకు కళ్యాణం జరిపించారు.

ఈ కళ్యాణాన్ని చూసేందుకు చాలామంది భక్తులు తరలి వచ్చారు.

అయితే ఒక దేవాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణం(Seetharama Kalyanam ) లో అరుదైన దృశ్యం జరిగింది.

అనుకొని అతిధుల రూపంలో రెండు వానరాలు ప్రత్యక్షమయ్యాయి.ఈ అద్భుత ఘటన తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లా( Kumuram Bheem )లో రెబ్బెన మండల కేంద్రంలోని రామాలయంలో జరిగింది.

శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాములకు ఆ గుడిలో కళ్యాణం జరిపించారు.అయితే ఆ కళ్యాణానికి ఆ ఊరి ప్రజలే కాదు రెండు వానరాలు అతిథులుగా వచ్చాయి.

రాములోరి కల్యాణం జరుగుతున్న సమయంలో అక్కడే ఉండి ఆ కళ్యాణాన్ని కనులారా తిలకించి, ఆ తర్వాత సీతారాములను ఆశీర్వదించాయి.

Telugu Devotional, Hanuman, Kumuram Bheem, Sita, Sri Rama, Sri Rama Navami, Tela

హనుమంతుడు వానర రూపంలో వచ్చి ఇలా ఆశీర్వదించాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు.అయితే కళ్యాణం జరిగిన తర్వాత పీట దగ్గరకు వెళ్లి సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న అక్షింతలను చేతిలో తీసుకొని విగ్రహాలపై వేసి ఆశీర్వదించాయి.ఆ తర్వాత మరికొన్ని అక్షింతలను, పండ్ల లను నోట్లో పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాయి.

ఆ దృశ్యాన్ని చూసినా భక్తులంతా రాములోరి కల్యాణానికి హనుమంతుల సైన్యం వచ్చిందని, భగవంతుడే స్వయంగా ఈ రూపంలో వచ్చి వారిని ఆశీర్వదించినట్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube