'పుష్ప 2' ఫస్ట్ లుక్ టీజర్.. కొత్త ప్రయోగం చేయబోతున్న సుక్కూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మందన్న (Rahsmika Mandanna) హీరోయిన్ గా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 1 భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో ఈసారి మరింత బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

 Pushpa 2 Official Teaser To Release On Allu Arjun Birthday Details, Allu Arjun,-TeluguStop.com

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించు కున్నాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ లో నటిస్తున్నాడు.

సీక్వెల్ తో మరింత గ్రాండ్ హిట్ అందుకుని పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా తన స్థాయిని పెంచుకోవాలని ఇంకొంచెం కష్టపడుతున్నాడు.పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మధ్యనే జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.మరి షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.పుష్ప 2 అప్డేట్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun Birthday) కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయనుందని తెలుస్తుంది.

ఇక ఇది కూడా చాలా వినూత్నంగా కొత్తగా చేయాలని సుక్కూ భావిస్తున్నారట.ఈ టీజర్ గురించి తాజాగా వైరల్ అవుతున్న బజ్ ఏంటంటే.ఈ ఫస్ట్ లుక్ టీజర్ (Pushpa 2 Teaser) తో సుకుమార్ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారట.

అది ఏంటంటే.వీడియో మొత్తం కేవలం హీరో మీదనే డిఫరెంట్ స్టైల్ లో పలు ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ను జోడించి చేయనున్నారట.

దీంతో ఈ అప్డేట్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube