సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన హెలికాప్టర్ సేవలు.. హైదరాబాద్ వాసులకే ప్రత్యేకం!

హెలికాప్టర్ రైడ్ ఈవెంట్ అయిన ఫ్లై హైదరాబాద్‌ను తాజాగా లాంచ్ చేశారు.దీంతో నగరవాసులు ఇప్పుడు నగరంలోని కొన్ని ప్రముఖ ల్యాండ్‌మార్క్‌లపై హెలికాప్టర్ రైడ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.

 Helicopter Services Made Available To The Common Man Special For The People Of-TeluguStop.com

ఫ్లై హైదరాబాద్‌ కంపెనీ ఈ కొత్త జాయ్‌ రైడ్‌ సర్వీసుల(Joy Ride Services)ను పరిచయం చేసింది.తెచ్చారు.మార్చి 8 నుంచి 13వ తేదీ వరకు ఈ జాయ్ హెలికాప్టర్ రైడ్స్(Helicopter rides) అందుబాటులో ఉంటాయి.13 అంటే ఈ రోజే కాబట్టి హైదరాబాద్ నగరంలో చూడదగిన ప్లేసెస్ ఆకాశం పైనుంచి చూడాలనుకున్న వారు వెంటనే బుక్ చేసుకోవడం మంచిది.హెలికాప్టర్ రైడ్స్ లో ఏ ఏ నగరాలను కవర్ చేస్తారు, టికెట్ ధర ఎంత ఉంటుంది అనేది విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Buddha Statue, Charminar, Fly Hyderabad, Helicopter, Joy, Latest, Necklac

ఫ్లై హైదరాబాద్‌ కంపెనీ తన హెలికాప్టర్లలో ప్రయాణికులను బుద్ద విగ్రహంతో సహా, నెక్లెస్ రోడ్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ప్యాలెస్‌ వంటి చూడదగిన ప్రదేశాలను చూపిస్తుంది.హెలికాప్టర్‌(Helicopter)లో ప్రయణిస్తూ ఈ ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.కేవలం 10 నిమిషాల పాటు సాగే ఈ హెలికాప్టర్‌ రైడ్‌ను మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

సుమారు 1000 అడుగుల ఎత్తు నుంచి అత్యంత సుందరమైన ప్రదేశాలను ఈ హెలికాప్టర్ ప్రయాణికులకు చూపిస్తుంది.

Telugu Buddha Statue, Charminar, Fly Hyderabad, Helicopter, Joy, Latest, Necklac

మార్నింగ్ టైమ్‌లో 11 గంటల నుంచి ఈవెనింగ్ టైమ్‌లో 4 గంటల వరకు ఈ రైడ్స్ అందుబాటులో ఉంటాయి.ఈ హెలికాప్టర్ రైడ్స్ ను నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్ వాటర్ పార్క్ సమీపంలో నెలకొల్పారు.ఒక్కో టికెట్ ధరను రూ.6,500గా నిర్ణయించారు.పాపులర్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా హెలికాప్టర్ రైడ్ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కొరకు 9797798999, 8328572041 నంబర్లకు ఫోన్ కాల్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube