శ్రీలీల స్టార్ హీరోయిన్ అవ్వడానికి కృతి ఫ్లాప్ హీరోయిన్ అవ్వడానికి రీజన్ ఇదే!

కృతిశెట్టి, శ్రీలీల దాదాపుగా ఒకే సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.కృతిశెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ కాగా ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు.

 This Is The Difference Between Krithishetty And Srileela Details Here , Krithis-TeluguStop.com

అయితే శ్రీలీల కెరీర్ మాత్రం మరో దారిలో నడిచింది.తొలి సినిమా పెళ్లి సందడి, రెండో సినిమా ధమాకా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

వరుసగా రెండు సక్సెస్ లతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగింది.

శ్రీలీల చేతిలో ప్రస్తుతం అటూఇటుగా పది సినిమాలు ఇస్తున్నాయి.

ఆమె చేతిలో ఉన్న సినిమాల సంఖ్య విని షాకవ్వడం ఇతర దర్శకనిర్మాతల వంతమవుతోంది.అయితే శ్రీలీల స్టార్ హీరోయిన్ అవ్వడానికి కృతి ఫ్లాప్ హీరోయిన్ అవ్వడానికి రీజన్ ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.

కృతిశెట్టి వరుస సినిమాలపై దృష్టి పెడితే శ్రీలీల మాత్రం కథ, పాత్రలపై దృష్టి పెట్టింది.

ప్రాధాన్యత ఉన్న రోల్స్ ను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లను అందుకునే దిశగా శ్రీలీల అడుగులు వేస్తోంది.కృతిశెట్టి ఇకనైనా కథలపై దృష్టి పెడితే ఆమె కూడా మరో రేంజ్ కు ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం కృతిశెట్టి రెమ్యునరేషన్ 60 లక్షల రూపాయలు కాగా శ్రీలీల పారితోషికం మూడు రెట్లు ఎక్కువగా ఉంది.

శ్రీలీల దెబ్బకు ఇతర హీరోయిన్లకు సైతం అవకాశాలు తగ్గాయి.శ్రీలీల అందం, అభినయంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో శ్రీలీల మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య, మహేష్, పవన్ సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకున్న శ్రీలీలకు కెరీర్ పరంగా తిరుగులేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కస్టడీ మూవీ రిజల్ట్ పై కృతిశెట్టి కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube