మార్చి నెలలో ఈ తేదీ నుంచి శ్రీశైలం మల్లన్న.. స్పర్శ దర్శనం రద్దు ఎందుకంటే..

శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.తాజాగా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మరో ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.

 From This Date In The Month Of March, Srisailam Mallanna Sparsha Darshan Is Canc-TeluguStop.com

నంద్యాల జిల్లాలో కొలువైన కోరి కొలిచే వారి కొంగు బంగారం శ్రీశైలం మల్లన్న మహా క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం వెల్లడించారు.మార్చి నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్ లవన్న వెల్లడించారు.

భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనాన్ని కల్పిస్తామని ఆయన వెల్లడించారు.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కూడా ఆయన తెలిపారు.

ఇంకా చెప్పాలంటే ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్వామివారి సర్వ దర్శనాన్ని భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అది కూడా నిధిష్ఠ వేళలలో 4 విడతల లో దర్శనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్ ను 500 రూపాయలు గా నిర్ణయించామని, ఒక్కో విడుతలో 1500 టికెట్లు మాత్రమే ఇస్తామని శ్రీశైలం దేవస్థానం ఈఓ వెల్లడించారు.ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఏడాది శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాము.

మొదటి రోజు ఉగాది ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టి శ్రీశైలం మల్లికార్జునుడికి విశేష సేవలు, అర్చనలు నిర్వహిస్తారు.ఇక మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలను మొదలు పెడతారు.

ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలను నిర్వహించి వీరాచార విన్యాసాలను, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించి అత్యంత ఘనంగా రథోత్సవాన్ని నిర్వహిస్తామని దేవస్థాన ఈవో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube