కింగ్ నాగార్జున రివ్యూస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదివరకు సినిమా రిలీజైన వారం రోజులకి పత్రికల్లో రివ్యూస్ రాసేవారు కానీ ఇప్పుడు సినిమా చూసిన వెంటనే వందల కొద్దీ రివ్యూస్ వచ్చేస్తున్నాయి.
సినిమా రివ్యూస్ చూసి సినిమాకు వెళ్లే పరిస్థితి వచ్చింది.అయితే అలా అని రివ్యూస్ వల్ల సినిమా దెబ్బ తింటుంది అంటే మాత్రం తాను ఒప్పుకోనని అంటున్నారు నాగ్.
రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అవగా ఆ సినిమాలో నాగార్జున ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా రివ్యూస్ మీద తన కామెంట్ చెప్పేశాడు నాగార్జున.
అయితే సినిమాకి ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ రావడం వల్ల సినిమా కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పే వారు ఉన్నారు.సినిమాలో విషయం ఉంటే అది రివ్యూస్ ఎంత ముందు వచ్చినా సరే సినిమా హిట్ అవుతుంది.
సినిమా బాగాలేకపోతే రివ్యూ ఇవ్వకపోయినా సరే ఫ్లాప్ అవుతుంది.నాగార్జున కూడా తాను వెబ్ సీరీస్ చూడాలంటే ఐడిఎంబి రేటింగ్ చూసి చూస్తానని.7 కన్నా ఎక్కువ రేటింగ్.1000 ఫీడ్ బ్యాక్ కామెంట్స్ వస్తే ఆ సీరీస్ చూస్తానని అన్నారు నాగార్జున.