ఏంటో సిని ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల( Celebrities ) మైండ్ సెట్ అనేది ఎవరికీ అర్థం కాదు.ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయంలో వారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.
అసలు పెళ్లిళ్ల విషయంలో వీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం అసలు అర్థం కావు.తొందరపడి ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని మరో వ్యక్తితో కొత్త జీవతం మొదలు పెడుతుంటారు.
నిజానికి ఇండస్ట్రీకి చెందిన వాళ్లకి ఇవన్నీ మామూలే.బయట తమ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనేది అసలు పట్టించుకోరు.
తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా సినిమా లాగా చూసుకుంటారు.ఇప్పటికే చాలామంది నటీనటులు విడాకులు తీసుకున్న వారితో కూడా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
ఇక ఈ మధ్యనే నరేష్ – పవిత్రలు( Naresh , pavitha ) కూడా కొత్త కాపురం పెట్టిన సంగతి తెలిసిందే.
![Telugu Kollywood, Love Story, Samyukta Menon, Trivikram-Movie Telugu Kollywood, Love Story, Samyukta Menon, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/Samyukta-Menon-with-the-hero-got-divorced-at-the-same-timee.jpg)
రేపో మాపో అన్నట్లు వయసులో ఉన్న ఈ జంట కూడా ఇలా ఉన్నారు అంటే.ఇక వయసులో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక హీరోయిన్ హన్సిక కూడా తన ఫ్రెండ్ విడాకులు ఇచ్చిన వ్యక్తిని ఆ మధ్యనే పెళ్లి చేసుకుంది.
అయితే తాజాగా హీరోయిన్ సంయుక్త మీనన్( Samyukta Menon ) కూడా విడాకులు తీసుకున్న హీరోతో వ్యవహారం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల క్రష్ లిస్ట్ సంయుక్త మీనన్ కూడా చేరిందని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త ఆ తర్వాత బింబిసారా, సార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో తనలో ఉన్న మరో యాంగిల్ బయట పెట్టింది.దీంతో తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం సంపాదించుకుంది.
![Telugu Kollywood, Love Story, Samyukta Menon, Trivikram-Movie Telugu Kollywood, Love Story, Samyukta Menon, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/Samyukta-Menon-with-the-hero-got-divorced-at-the-same-timec.jpg)
ఇక తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో( Tamil a, Malayalam ) కూడా నటిస్తుంది.ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది.తెలుగులో కూడా ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది.అయితే ఇదంతా పక్కనే పెడితే ఈ ముద్దుగుమ్మ నటిగా బాగానే పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మాత్రం బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
కారణం తను విడాకులు తీసుకున్న ఓ హీరోతో ప్రేమయాయణం చేస్తున్నట్లు తెలిసింది.ఇప్పటికే ఈమెకు డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఏదో జరుగుతుందన్న వార్తలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి.
కానీ తాజాగా ఈమె ఓ కోలీవుడ్ స్టార్ హీరో తో ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి.
![Telugu Kollywood, Love Story, Samyukta Menon, Trivikram-Movie Telugu Kollywood, Love Story, Samyukta Menon, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/Samyukta-Menon-with-the-hero-got-divorced-at-the-same-timed.jpg)
అంతకుముందే ఆ హీరో ప్రేమించి పెళ్లి చేసుకుని తన భార్యకు విడాకులు ఇచ్చాడట.ఇక ఆ విడాకులు తీసుకున్న హీరో పైనే ఈ అమ్మడు మనసు పారేసిందని తెలిసింది.అతడు ఒప్పుకుంటే రెండో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
ఇక ఆ హీరో ఎవరు అనేది బయటపడకుండా రహస్యంగా ఉండగా.ఆ హీరోకి కూడా ఈమె అంటే ఇష్టమని తెలిసింది.
ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.దీంతో జనాలు ఈ వార్త విని ఈమెకు ఏం పోయేకాలం వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.