యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్( Salaa ) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.నిన్న విడుదల అయిన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
కేజీఎఫ్ మాదిరిగా ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ రాకున్నా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మరియు యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు సలార్ థియేటర్ల వద్ద క్యూ కట్టే అవకాశాలు మస్త్ గా ఉన్నాయని, ప్రభాస్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరుకు ఫ్యాన్స్ కాని వారు కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా రివ్యూవర్స్ మరియు చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కథ ను కాస్త కన్ఫ్యూజన్ గా చూపించినా కూడా ఓవరాల్ గా మాత్రం సినిమా సినీ ప్రేమికులకు విందు బోజనం అన్నట్లుగానే సినిమా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ సినిమా ప్రారంభం నుంచి కూడా కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు.మరి నిన్న విడుదల అయిన సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూళ్లు చేయగలుగుతుందా లేదా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.సెకండ్ హాఫ్ విషయం లో కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కనుక కలెక్షన్స్ విషయం లో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు సందడి మరియు రాబోయే మూడు రోజుకులకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ చూస్తూ ఉంటే బాబోయ్ ఇది వెయ్యి కోట్ల సినిమా కాదు.అంతకు మించిన సినిమా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వెయ్యి కోట్ల సినిమాగా ఇప్పటికే ఈ సినిమాను ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.అయితే వెయ్యి కోట్ల కు పైన ఎంత ఈ సినిమా వసూళ్లు చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన విషయం.
సలార్ సినిమా లాంగ్ రన్ వసూళ్లు ఎంత ఉంటాయి అనేది తెలియాలంటే మరో వారం పది రోజుల వరకు ఆగాల్సిందే.