మన భారత దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వెళ్లి భగవంతునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అయితే అన్నవరం సత్యదేవుని ప్రసాదం మరింత నాణ్యతగా భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఇన్‌ఛార్జి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ ప్రసాదం పై దృష్టి సారించారు.ప్రముఖులు, వివిఐపీలు వచ్చే సమయంలో వారికి ఇచ్చేందుకు మరింత నాణ్యతగా ప్రసాదాన్ని కొంత సిద్ధం చేసి ఇస్తూ ఉంటారు.
అందరికీ ఒకే రకమైన ప్రసాదం అందించడం పై ఈవో దృష్టి సారించారు.ఇందులో భాగంగా ప్రసాదం తయారీ విధానాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించారు.అక్కడే ఉండి గోధుమ నూక, నెయ్యి, పంచదార లాంటి చాలా సరుకులు ఎంత పరిమాణంలో వినియోగిస్తున్నారో ఈవో పరిశీలించారు.భక్తులకు వసతి గదుల కేటాయింపులో లోపాల పైన కూడా ఆయన సమీక్షించారు.
బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడంతో గది కేటాయించిన తర్వాత ఇచ్చే రసీదు పై పూర్తి వివరాలు ఉండకపోవడం, గది కేటాయించిన భక్తులు మొబైల్ కు సంక్షిప్త సందేశం రాకపోవడంతో ఆ విభాగం అధికారులను ఈవో ప్రశ్నించినట్లు సమాచారం.
వేద పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం చూసి ఆయన కూడా దాన్ని స్వీకరించారు.మెయిన్ క్యాంటీన్ ఎదురుగా వినియోగించకుండా ఉన్న పీజీహెచ్ గదులను తెరిచి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.ఆడిట్ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించాలని ఆయన వెల్లడించారు.
కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ అనుమతుల పై అరా తీశారు.గోశాల, కేశఖండనశాల పరిశీలించి సూచనలు చేశారు.
ఈవో కార్యాలయం వద్ద వాస్తు మార్పులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా చెప్పాలంటే దేవస్థానం ఉద్యోగులంతా ఫోన్లు వచ్చినప్పుడు భక్తులు ఉన్నత అధికారులు ప్రముఖులతో మాట్లాడే సమయంలో జై సత్యదేవ అని సంబోధించాలని అధికారులకు సూచించారు.
DEVOTIONAL