అన్ని తానే తమ్ముడి పెళ్లి చేసిన మంచు లక్ష్మి.. చివరికి కుటుంబాన్ని కూడా కలిపింది

మంచు లక్ష్మి మంచు మనోజ్ ఇద్దరూ ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాదు తండ్రి మోహన్ బాబు అయినా కూడా మంచు లక్ష్మికి తన సొంత సోదరుడు విష్ణు కన్నా కూడా మనోజ్ పైన విపరీతమైన అభిమానం.

ఈ విషయం ఇప్పుడే కాదు తొలినాళ్ళ నుంచి కూడా మీడియా ముందు కనిపిస్తూనే ఉంటుంది.

మంచు మనోజ్ తొలిసారి ఈ ప్రణీత రెడ్డితో వివాహం జరిగిన సమయంలో కూడా లక్ష్మి కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే.మంచు మనోజ్ కి వెళ్ళినప్పుడు లక్ష్మి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు అన్ని విషయాల్లోనూ ఆమె ముందుండి చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు మనోజ్ కి రెండో వివాహం జరగడం లోను మంచం లక్ష్మిదే కీలక పాత్ర అని తెలుస్తోంది.

తన తమ్ముడికి కుటుంబం ఉండాలనే మంచు లక్ష్మి ఎన్నాళ్ళ నుంచి పరితపిస్తూ ఉందట అందుకు భూమా మౌనికను సరైన భాగస్వామిగా మనోజ్ అనుకోగానే తొలత మంచు లక్ష్మికే తెలియచేశాడట.మోహన్ బాబుకు ఈ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది పెళ్లికి కూడా రారు అని అనుకుంటున్న ఆయన రావడం అందరిని షాక్ గురిచేసింది.ఇక మంచు లక్ష్మి అన్ని తానే ఈ పెళ్లిని జరిపించడం ఒక విధంగా ఎంతో గొప్ప బాధ్యత అనే చెప్పుకోవాలి.

Advertisement

పెళ్లి జరిగిన తర్వాత నూతన వధూవరులను తిరుపతికి తీసుకెళ్లి దర్శనం కూడా చేయించింది లక్ష్మి.ఒక సోదరిగా ఉంటూనే తల్లిదండ్రుల బాధ్యతలు కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటికే గత ఆరేళ్లుగా సినిమాలు లేక డిప్రెషన్ లో ఉన్న మంచు మనోజ్ కి అక్క లక్ష్మి ఎప్పుడూ అండగా ఉంటూనే ఉంది.ఇక ఇప్పుడు అతని ఓ ఇంటి వాటిని చేసి తన బాధ్యత తీర్చుకుంది.మంచు విష్ణు సైతం మనోజ్, లక్ష్మి బాగా కలిసిపోతారని వారితో నేను కలవలేనంటూ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

చాలా రోజులుగా వీరి కుటుంబంలో వివాదాలు ఉన్నట్టుగా మీడియాకు కోడై కూస్తోంది.ఇక ఈ దెబ్బతో అందరినోళ్లు మూతపడ్డట్టుగా కనిపిస్తోంది మంచి కుటుంబం మళ్లీ అంతా దగ్గరయ్యారు దీనికి అందరికి ఈ కారణం ఖచ్చితంగా లక్ష్మి అని చెప్పి తీరాల్సిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు