బాలీవుడ్ నటుడిగా నిర్మాతగా ఫిలిం క్రిటిక్ గా పేరు సంపాదించుకున్న కమల్ ఆర్ ఖాన్ తరచు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అయితే ఈయన ఎక్కువగా సినిమాల గురించి సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారు.
ఇక ఈయన చేసే ట్వీట్ల వల్ల కొంతమంది సెలబ్రిటీలు ఈయనపై కేసు కూడా నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే.అయినప్పటికీ ఈయన ధోరణి ఏ మాత్రం మార్చుకోకుండా అలాంటి సంచలనమైన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఈ క్రమంలోని తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనంతరం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఎన్నో అంచనాల నడుమ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాని కె ఆర్ కె RRR సినిమాతో పోలిస్తే చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
పుష్ప 2 అన్ని భాషల రైట్స్ కి అల్లు అర్జున్ రూ.1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఈయన ట్వీట్ చేశారు.ఆర్ ఆర్ ఆర్ రైట్స్ కేవలం రూ.750 కోట్లకు అమ్ముడైన నేపథ్యంలో వెయ్యి కోట్లు డిమాండ్ చేయడం ద్వారా RRR సినిమా కంటే పుష్ప 2 సినిమా ఎంతో బెటర్ అంటూ ఈయన ఎద్దేవా చేశారు.అయితే పుష్ప 2 సినిమా రూ.1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారని స్పష్టమైన సమాచారం లేకపోయినా ఈయన మాత్రం పుష్ప 2 సినిమాని హైలెట్ చేస్తూ RRR సినిమాని తక్కువ చేసి మాట్లాడుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ పోస్ట్ పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.