సూపర్ స్టార్ మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం సినిమాను రూపొందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కనిపించకుండా పోయాడు.ఆ సినిమా తర్వాత లక్కీగా వెంకటేష్ తో నారప్ప సినిమా ను రూపొందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా శ్రీకాంత్ అడ్డాలను ఏ ఒక్క నిర్మాత కానీ హీరో కానీ పట్టించుకోవడం లేదు.అడ్డాల ప్రస్తుతం కథ లు రాసే పనిలో ఉన్నాడా అనేది తెలియడం లేదు.
నారప్ప సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ లేకుండా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా శ్రీకాంత్ అడ్డాల గురించిన ఎలాంటి హంగామా లేదు.
ఆయన యొక్క తదుపరి సినిమా ఎప్పుడు.అసలు ఉందా లేదా అనేది కూడా తెలియడం లేదు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందించి మంచి ప్రశంసలు దక్కించుకున్న శ్రీకాంత్ అడ్డాల మళ్లీ అలాంటి సినిమా చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.కానీ అది ఎంత వరకు సాధ్యం అనేది మాత్రం క్లారిటీ లేదు.నారప్ప సినిమా కు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అనే విషయం కూడా చాలా మందికి తెలియడం లేదు.అందుకే ఆయనకు ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను తలకిందులు చేసిన సినిమా బ్రహ్మోత్సవం.ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే.
అత్యంత దారుణమైన ఆ సినిమా ను మహేష్ బాబు ఎలా చేశాడో అర్థం కాదు.శ్రీకాంత్ అడ్డాల ఏం చెప్పి ఆ సినిమా కు గాను మహేష్ బాబు ను ఒప్పించాడో అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.