మనకు ఇంటర్నెట్లో లెక్కకు మించి జంతువుల వీడియోలు కనిపిస్తుంటాయి.వాటిని చూసినప్పుడు చాలా సార్లు నవ్వు వస్తుంది.
కొన్నిటి విషయంలో చాలా ఆశ్చర్యం వేస్తుంది.ట్యాలెంట్ మనుషులలో మాత్రమే కాకుండా జంతువులు, పక్షులలో కూడా ఉంటుంది.
అప్పడప్పుడు అవి బయటపడతాయి.వాటిని చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేం.
ఇతరులు ప్రదర్శించిన ట్యాలెంట్ చూసినప్పుడు కొందరు ప్రశంసిస్తారు.మరికొందరు ఈర్ష్య పడతారు.
మనుషులలో ఉండే ట్యాలెంట్ జంతువులు, పక్షులలో చూసినప్పుడు ఎలాంటి వారైనా ఆశ్చర్యపోతారు.సరిగ్గా ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల, పావురం బ్యాక్‌ఫ్లిప్‌లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.వీడియోలో అనేక పావురాలు ఒక పొలంలో తిరుగుతున్నాయి.
ప్రస్తుతం బ్యాక్ ఫ్లిప్స్ కొడుతున్న పావురం శరీరం నీలి రంగులో ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ, ఒక పావురం మనుషులు, కోతుల కంటే వేగంగా వెనక్కి బ్యాక్ ఫ్లిప్ లు కొడుతోంది.పలు మార్లు చాలా సక్సెస్‌ఫుల్‌గా అది బ్యాక్ ఫ్లిప్‌లు కొట్టింది.ఈ వీడియోను ‘బ్యూటెంగెబిడెన్’ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 మిలియన్లకు పైగా వ్యూస్, 1,08,000 లైక్‌లు దక్కాయి.
ఈ వీడియోను చూసినప్పటి నుంచి నెటిజన్లు బాగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇలా తాము చేయలేమని, ప్రయత్నిస్తే దెబ్బలు తగలడం ఖాయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.మూన్ వాక్ కంటే ఈ పావురం చేసే బ్యాక్ ఫ్లిప్‌లు బాగున్నాయని కొందరు కామెంట్లు చేశారు.
ఆ పావురం అసాధారణ రీతిలో చేసిన బ్యాక్ ఫ్లిప్‌లు చాలా బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.