కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది.కైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ మేరకు వెంకటరమణ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు.
కైకలూరులో వెంకటరమణ టీడీపీ కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే.
టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.కాగా స్థానిక సంస్థల కోటాలో వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.