కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరిగిన పుణ్యక్షేత్రం తిరుమల లో అపచారం జరిగింది.తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చంగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండ పై అపవిత్రం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో తరచూ మద్యం మాంసం సేవిస్తూ తిరుమలలో పట్టుబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.ఇక తాజాగా తిరుమలలోని షికారి వీధిలో కొందరు షికారులు మాంసం వండి తింటున్నట్లు టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి నా అధికారులు ఇద్దరు షికారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇక వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి తరలించి విచారణ మొదలుపెట్టారు.షికారిలకు మాంసం ఎక్కడి నుంచి వచ్చింది.ఎవరిచ్చారు? తిరుమల కొండ పైకి వారు మాంసాన్ని తీసుకు వెళ్తుంటే భద్రత అధికారులు ఏం చేస్తున్నారు.
![Telugu Abusetirumala, Bakthi, Bakti, Devotees, Devotional, Srivenkateswara, Tiru Telugu Abusetirumala, Bakthi, Bakti, Devotees, Devotional, Srivenkateswara, Tiru]( https://telugustop.com/wp-content/uploads/2023/02/Abuse-in-Tirumala-Devotees-expressing-anger-over-securityb.jpg)
అంతే కాకుండా అధికారులు ఎందుకు వీరి వద్ద మాంసాన్ని గుర్తించలేదు.వంటి అనేక కోణాలలో దర్యాప్తు మొదలుపెట్టారు.ఇటువంటి ఘటనలు జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తిరుమల కొండ పై పవిత్రంగా ఉండేలా చూడాలని మద్యం, మాంసాలతో వెంకన్న కొండను అపవిత్రం చేయవద్దని చాలామంది భక్తులు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.
టిటిడి అధికారులు ఇటువంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
![Telugu Abusetirumala, Bakthi, Bakti, Devotees, Devotional, Srivenkateswara, Tiru Telugu Abusetirumala, Bakthi, Bakti, Devotees, Devotional, Srivenkateswara, Tiru](https://telugustop.com/wp-content/uploads/2023/02/Abuse-in-Tirumala-Devotees-expressing-anger-over-securityc.jpg )
ఇదిలా ఉండగా ఇటివల కాలంలో తిరుమల కొండ పై జరుగుతున్న అనేక ఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి.గత కొద్ది రోజుల క్రితం శ్రీ వారి దేవాలయానికి సంబంధించి డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పుడు కూడా స్వామి వారి దేవాలయం వద్ద భద్రత పై సర్వత్ర చర్చ జరిగింది.ఇక తిరుమల శ్రీవారి దేవాలయం మడ వీధులలోకి సీ ఎం ఓ స్టిక్కర్ వేసుకున్న ఒక ఇన్నోవా కారు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అప్పుడు కూడా శ్రీవారి దేవాలయ భద్రత ప్రమాణాల పైన అనుమానాలు వచ్చాయి.
LATEST NEWS - TELUGU