రెండేళ్లు అవుతున్న ‘RC15’ షూట్ ముగించక పోవడానికి కారణం వీరేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఈ సినిమాతో రామ్ చరణ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.

 రెండేళ్లు అవుతున్న ‘rc15’ షూ-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు రామ్ చరణ్ అంటే వరల్డ్ వైడ్ గా అందరికి తెలుసు.ఈ సినిమా తర్వాత చరణ్ మరో డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15‘.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ప్రకటించగానే అంచనాలు పెరిగాయి.శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.

మరి ఈ సినిమా స్టార్ట్ అయ్యి దడపా 2 ఏళ్ళు పూర్తి అయ్యింది.

Telugu Dil Raju, Shankar, Kiara Advani, Ram Charan, Rc, Shankarram-Movie

అయినా కూడా ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వలేదు.ప్రెజెంట్ రాజమండ్రి, విశాఖ లోని గోదావరి నది ఒడ్డున సినిమా షూట్ చేసారు.అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్ రాజమండ్రిలో ఈ సినిమాకే సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్టు తెలుస్తుంది.

మరి అంతా బాగున్నా ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

Telugu Dil Raju, Shankar, Kiara Advani, Ram Charan, Rc, Shankarram-Movie

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు షూట్ నిలిపి వేయడం, ఆర్ట్ డైరెక్టర్లు మౌనిక రామకృష్ణ, రవీందర్ సినిమా నుండి బయటకు వెళ్లిపోవడం, పబ్లిక్ స్థలాల్లో షూట్ చేయడం, శంకర్ ఇండియన్ 2 సినిమా షూట్ కోసం వెళ్లడం వంటి కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.ఇదిలా ఉండగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube