‘క్వైట్ మోడ్’ గురించి వినే వుంటారు.ఇన్‌స్టాగ్రామ్ వాడేవారు దీని గురించి వినే వుంటారు.
అయితే అందరికీ దీని గురించి తెలియదు.యావత్ ప్రపంచ సోషల్ మీడియా యాప్స్‌లోనే ముందంజలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్.
స్క్రీన్ టైంను తగ్గించడం కోసం ఈ కొత్త ఫీచర్ ఒకదానిని తీసుకొస్తోంది.రోజులో ఎక్కువ గంటలు సోషల్ మీడియాకే కేటాయిస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ బ్రేక్ కోసం ఈ ‘క్వైట్ మోడ్’ అనే ఫీచర్ తీసుకు రాబోతున్నట్టు సమాచారం.
డిజిటల్ డీటాక్స్‌కు ఈ ఫీచర్ ఎంతగానో సహకరిస్తుంది.
అయితే, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయంపైన అందరికీ అవగాహన ఉండదు.
రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోలు చూస్తూ అనేకమంది ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు.అయితే ఈ విషయాన్ని దాదాపుగా ఇలాంటి కంపెనీలు పట్టించుకోవు.
కానీ ఇన్స్టా యూజర్ల మేలుకొరకు ఆలోచించడం చెప్పుకోదగ్గది.సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు యూజర్లు బ్రేక్ తీసుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ ‘క్వైట్ మోడ్’ ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్‌తో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను పాజ్ చేయవచ్చు.
అలాగే ఫ్రెండ్స్, ఫాలోవర్స్‌కు దీని ద్వారా లిమిట్ సెట్ చేసుకోవచ్చు.డైరెక్ట్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లై ఇచ్చేలా సెట్ చేసుకొనే వీలుంది.ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు తమ షెడ్యూల్‌కు సరిపోయేలా క్వైట్ మోడ్ అవర్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఇకపోతే, ఈ కొత్త ఫీఛర్ ప్రస్తుతం అమెరికా, ఇంగ్లండ్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో ఇండియన్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెస్తోంది.కాబట్టి యూజర్లు ఈ ఫీచర్ పైన అవగాహన పెంచుకుంటే చాలా మేలు చేకూరనుంది.