అయ్యప్ప కి కన్నె స్వాములు అంటే ఇష్టం ఎందుకో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు.అయ్యప్ప పేరు అయ్యా అంటే విష్ణువు మరియు అప్ప అంటే శివుడు అని అర్థం వస్తుంది.

 Do You Know Why Ayyappa Likes Kanne Swamulu ,ayyappa,kanne Swamulu,ayyappa Swami-TeluguStop.com

విష్ణు అవతారం, మోహిని మరియు శివుడి కలయిక వలన అయ్యప్ప జన్మించాడు.కాబట్టి స్వామికి అయ్యప్ప అని పేరు వచ్చింది.

ఇంకా ఈయనను హరిహర సుతుడు, మణికంఠ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు.అయితే అయ్యప్ప స్వామి మాల ధారణ వేసుకున్న వారిలో కన్నె స్వాములను ఎక్కువగా ఆరాధిస్తుంటారు.

అయితే అయ్యప్పకు కన్నే స్వాములు అంటేనే ఎందుకంత ఇష్టం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిసారిగా అయ్యప్ప మాల ధారణ వేసుకున్న భక్తులను కన్నె స్వాములుగా పిలుస్తూ ఉంటారు.

అయితే అయ్యప్ప స్వామికి కన్నె స్వాములు అంటే ఇష్టం ఉండడానికి ఒక కథ ఉంది.ఈ పురాణాలలోకెళ్తే దత్తత్రియుడి భార్య లీలావతి ఒక శాపంతో మహిషాసురుని సోదరి మహిషాసుర జన్మించింది.

అయితే ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని లోకమాత సంహరించడంతో తన అన్నను చంపినందుకుగాను దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని శక్తులను పొంది ఆ తర్వాత ప్రజలను హింసించ సాగింది.

Telugu Ayyappa, Ayyappa Swami, Bhakti, Devotional, Harihara Sutudu, Kanne Swamul

దీనివల్ల దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు అయ్యప్పగా జన్మించి దత్తత్రియుడు అయ్యప్పగా జన్మించి మహిషసురుని సంహరిస్తాడు.దీనివల్ల ఆమెకు శాప విమోచనం లభిస్తుంది.దీనివల్ల ఆమె అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది.

ఇక ఆమె కోరికను అయ్యప్ప స్వామి తిరస్కరిస్తాడు.అంతేకాకుండా ఆమె పట్టు విడవకపోవడంతో తన మాల వేసుకుని 40 రోజులు దీక్ష చేసిన కన్నే స్వామి తన దర్శనానికి రానప్పుడు తనని పెళ్లి చేసుకుంటారని మాట ఇస్తాడు.

ఇక వారి రాకకు గుర్తుగా శరణ్ గుత్తిలో బాణాలనుకొచ్చుతారు.

Telugu Ayyappa, Ayyappa Swami, Bhakti, Devotional, Harihara Sutudu, Kanne Swamul

అక్కడ ఎప్పుడైతే ఒక భాగం కూడా కనిపించదో అప్పుడు పెళ్ళాడుతానని చెబుతాడు.అంతేకాకుండా శబరి కొండల్లో నీవు పురోత్తమా గా పూజలు అందుకుంటావని తెలిపారు.అయితే దీనికి గల అర్థం కన్నే స్వాముల రాక ఎప్పటికీ ఆగదని ఎందుకంటే అయ్యప్ప బ్రహ్మచారి అవతారం.

దీనిలో భాగంగానే శబరిమలకు వచ్చిన కన్నే స్వాములు ఎరిమెల్లి నుంచి తీసుకొచ్చిన బానులను శరం గుత్తిలో ఉంచుతారు.ఈ కారణం చేతనే ఎక్కడికి వెళ్లినా అయ్యప్ప భక్తులలో కన్నే స్వాములకు అంత ప్రాధాన్యత ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube